AP New Districts: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదాన్ని తెలియచేశారు. మార్కాపురం, మదనపల్లె జిల్లాలు, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు సీఎం నిర్ణయించారు. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం ఈ మార్పు చేర్పులకు ఆమోదాన్ని తెలియచేశారు. ఈ నిర్ణయంతో మొత్తంగా రాష్ట్రంలో 29 జిల్లాలు ఏర్పడనున్నాయి. అలాగే కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకారం తెలిపారు.…
New Districts In AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో మరో కీలక మార్పు చోటుచేసుకుంది. రాష్ట్రంలో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ఆమోదం తెలిపారు. తాజా నిర్ణయంతో మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు కొత్తగా ఏర్పడనున్నాయి. ఇందులో రంపచోడవరం కేంద్రంగా కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది. ప్రజలకు పరిపాలన మరింత చేరువ కావాలని, సేవల వేగవంతమైన అందుబాటు కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. IP68+IP69 డ్యూయల్ ప్రొటెక్షన్,…
AP New Districts: అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర జిల్లాల పునర్విభజనపై కీలక మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. రాష్ట్ర పరిపాలనను మరింత సమర్థవంతంగా మార్చేందుకు జిల్లాల పునర్వ్యవస్థీకరణ అవసరమనే దృక్కోణంలో జరిగిన ఈ సమావేశం ప్రధానంగా కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్‌ల పునర్విభజనపై చర్చ జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు అనగాని సత్య ప్రసాద్, పొంగూరు నారాయణ, బిజి జనార్ధన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. వర్చువల్ ద్వారా…
Kidney Racket: అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ సంచలనం రేపింది. మానవ అవయవాల అక్రమ రవాణా నేపథ్యంలో ఒక మహిళ మృతి చెందడం, పలువురు వైద్యులు, ముఠా సభ్యులు అరెస్టు కావడం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించింది. విశాఖపట్నంకు చెందిన ఇద్దరు మహిళలను పద్మ అనే మహిళ మదనపల్లికి తీసుకొచ్చింది. వీరిపై గ్లోబల్ ఆస్పత్రిలో కిడ్నీ తొలగించే శస్త్రచికిత్సలు చేశారు. అయితే ఆ ఆపరేషన్‌లో యమున అనే మహిళ పరిస్థితి విషమించి మరణించింది. దీనితో యమున…
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంపీ మిథున్ రెడ్డి సోదరుడి లాంటివారు.. ఎప్పుడూ నేనున్నానంటూ.. వెంటే ఉంటారని.. ఆ కక్ష తోనే కూటమి ప్రభుత్వం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసింది.. కొమ్మలను నరికిస్తే చెట్టు బలహీనమవుతుందనే మిథున్ రెడ్డిని ఆధారాలు లేకపోయినా అరెస్టు చేశారని ఆరోపించారు మదనపల్లి వైసీపీ ఇంఛార్జ్ నిస్సార్ అహ్మద్.
రియల్టర్ గంగాధర్ (37) హత్య కేసులో విస్తుపోయే నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. భర్త వేధింపులు తాల లేక భార్య మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి భర్తను హత్య చేసిందని పోలీసులు విచారణలో వెల్లడైంది.. మొదట ఫైనాన్స్ వ్యవహారం హత్యకు కారణమని భావించిన పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు బయటపడుతున్నాయి.
జమ్మూకశ్మీర్‌లో పహల్గాం ఉగ్రదాడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తల నేపధ్యంలో ఏప్రిల్ 27వ తేది వరకు దేశంలో ఉండే పాకిస్థానీయులు తిరిగి తమ దేశానికి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపధ్యంలో భారతదేశంలో పాకిస్తాన్‌కు చెందిన వారిని పోలీసులు గుర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఐదు మంది పాకిస్థానీయులను ఉన్నట్లు గురించారు. ఇండియన్ ఎంబసీ సమాచారంతో ఒకే కుటుంబానికి…
మదనపల్లి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళ తన్నులాట పీక్స్ చేరిందని అంటున్నారు. డజన్ మందికి పైగా నేతలు ఈ టికెట్ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినా... చివరికి అధినేత చంద్రబాబు మాత్రం మాజీ ఎమ్మెల్యే షాజహాన్ భాషావైపు మొగ్గు చూపారు. దీంతో అసంతృప్తితో ఉన్న మిగతా నేతలు ఎన్నికల్లో షాజహాన్‌కు సహకరించలేదని చెప్పుకుంటారు. చివరికి కొన్ని చోట్ల ఏజెంట్లను కూడా పెట్టలేదట.
చీకటి వ్యాపారంలో మునిగి తేలుతున్న డాక్టర్ల అక్రమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో స్కానింగ్ మాఫియాతో డాక్టర్లు చేతులు కలిపారు. ల్యాబ్, స్కానింగ్, ఎక్స్‌రేలను ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లకు రాసి.. సీల్డ్ కవర్లో డబ్బులు తీసుకొంటున్నారు. లక్షల్లో ప్రభుత్వ సొమ్మును జీతాల రూపంలో తీసుకుంటున్న మదనపల్లె డాక్టర్లకు ఇది ఓ వ్యసనంగా మారింది. రోగులకు వైద్యం చేయాల్సింది మరచి.. అదే రోగులతోనే మూడు పువ్వలు ఆరు కాయలుగా డాక్టర్ల వ్యాపారం కొనసాగిస్తున్నారు. మదనపల్లె జిల్లా అస్పత్రిలో…
పచ్చని కాపురంలో ఇన్స్టాగ్రామ్ ప్రేమ చిచ్చుపెట్టింది. భార్య వ్యవహారాన్ని పసిగట్టి బుద్ధి చెప్పాలనుకున్న భర్త.. ఆమె ముందే ప్రియుడికి దేహశుద్ధి చేశాడు. భార్యతో మాట్లాడుతున్న ప్రియుడిపై ఆమె భర్త, అతని అనుచరులు దాడి చేశారు. ఈ ఘటన శనివారం రాత్రి అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి వద్ద చోటుచేసుకుంది. మదనపల్లె రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. అన్నమయ్య జిల్లా ములకల చెరువు మండలం వడ్డిపల్లికి చెందిన…