YS Jagan: అమరావతిపై జగన్ సంచలన వ్యాఖ్యలు..
- ఏపీ రాజధాని అమరావతిపై జగన్ సంచలన వ్యాఖ్యలు..
- వైసీపీ కేంద్ర కార్యాలయంలో లీగల్‌సెల్ న్యాయవాదులతో భేటీ..
- అమరావతిలో అవినీతికి అంతులేకుండా పోతోందని ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ఏపీ రాజధాని అమరావతిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైయస్సార్‌సీపీ లీగల్‌సెల్ న్యాయవాదులతో సమావేశమైన ఆయన.. అమరావతిలో అవినీతికి అంతులేకుండా పోతోందని ఆరోపించారు.. చదరపు అడుగకు 4 వేలు పెడితే ఫైవ్ స్టార్ సదుపాయాలు వస్తాయి.. అమరావతిలో చదరపు అడుగుకు 10 వేలు ఖర్చు చేస్తున్నారు.. మొబలైజేషన్ అడ్వాన్స్‌ల పేరిట దోపిడీ చేస్తున్నారు.. 10 శాతం ఇచ్చి 8 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారని విమర్శించారు.. మనం 2.49 లకు పీపీఏ చేసుకుంటే, దానిపై విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు 4.60 పైసలకు పీపీఏ చేసుకుంటున్నారన్న జగన్.. అవినీతికి అంతులేకుండా పోయింది. నియోజకవర్గంలో మట్టి, గ్రావెల్, మైనింగ్, పరిశ్రమలు నడపాలన్నా.. కమీషన్లు ఇవ్వాల్సిందే.. పోలీసులు దగ్గరుండి వీటికి సహకరిస్తున్నారు. కళ్లముందే కరప్షన్ కనిపిస్తోందని ఆరోపణలు గుప్పించారు..
Read Also: Cloudburst in Uttarakhand: ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్.. కొట్టుకుపోయిన గ్రామం!
Also Read
- AP Local Body Elections: కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఎన్నికల వ్యూహంపై చర్చ
- Janasena First List: 2 కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలకు జనసేన అభ్యర్థులు ఖరారు.. తొలి జాబితా పూర్తి వివరాలు ఇవే
- AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
- TDP Candidates 1st List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ తొలి జాబితా.. 61 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చోటు
అయితే, జగన్ 2.Oలో మీ అందరికీ ప్రాధాన్యత ఉంటుంది.. పార్టీ కోసం కష్టపడే వారికి తప్పకుండా వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు వైఎస్ జగన్.. పార్టీకి పనిచేసేవారికి డేటాబేస్ పెడుతున్నాం.. దీని ఆధారంగానే వీరికి గుర్తింపు ఉంటుంది.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కోసం ఎవరు పనిచేస్తారో, వారికి ప్రాధాన్యత ఉంటుంది.. మరికొద్దిరోజుల్లో యాప్‌కూడా విడుదల చేస్తున్నాం.. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అన్యాయం జరిగినా.. ఆ యాప్‌లో ఫిర్యాదు చేయొచ్చు.. తన దగ్గరున్న ఆధారాలను, సాక్ష్యాలను యాప్‌లో అప్‌లోడ్ చేయవచ్చు.. ఆటోమేటిక్‌గా ఇవన్నీ డిజిటల్ లైబ్రరీలోకి వస్తాయి.. అన్యాయాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చట్టం ప్రకారం చర్యలు ఉంటాయి.. చట్టం తన పని తాను చేసుకుపోతోంది.. తప్పు చేయకపోయినా దెబ్బలు తింటున్న వ్యక్తికి ఎంత బాధ ఉంటుందో, అన్యాయంగా బాధ పెట్టించిన వ్యక్తికి కూడా అర్థం కావాలంటూ ఆసక్తికర వ్యాఖ్‌యలు చేశారు జగన్..
Read Also: National Film Awards Jury : పృథ్వీరాజ్ సుకుమారన్ కు బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఎందుకు ఇవ్వలేదంటే
రాష్ట్రంలో ఇవాళ ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి అన్నారు జగన్.. న్యాయవాదులు కీలక పాత్ర పోషిస్తున్నారు. పార్టీకి అన్నిరకాలుగా తోడుగా, పెద్దన్నగా మీరు ఉంటున్నారు. అడగకపోతే అమ్మ అయినా అన్నంపెట్టదు. కోరకపోతే దేవుడైనా వరం ఇవ్వడు. పిటిషన్ వేయకపోతే, న్యాయవాదులు వాదనలు వినిపించకపోతే న్యాయంకూడా దక్కదు. న్యాయవాదులుగా మీరు పోషిస్తున్న పాత్ర అభినందనీయం. చంద్రబాబు పాలనలో కలియుగ రాజకీయాలు చూస్తున్నాం. న్యాయం, ధర్మం ఎక్కడా కనిపించడం లేదు. తమకు వ్యతిరేకులని తెలిస్తే చాలు జైళ్లలో వేస్తున్నారు. నీచమైన సంస్కృతిని మనం చూస్తున్నాం. ఒక మనిషిని జైల్లో పెట్టడం అంటే వారి పరువు, ప్రతిష్టలతో ఆడుకోవడం.. తప్పుడు కేసులు పెట్టి వేదిస్తున్నారు.. తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో నడిపిస్తున్నారు.. ప్రలోభాలు పెట్టి, బెదిరించి తప్పుడు వాంగ్మూలాలు తీసుకుంటున్నారు.. ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా కేవలం తప్పుడు వాంగ్మూలాలు తీసుకుని కుట్రలు చేస్తున్నారు.. రాష్ట్రంలో మొదటిసారి ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం.. బాధితుల తరఫున న్యాయవాదులు నిలబడాలని పిలుపు నిచ్చారు..
Read Also: Mrunal- Danush : పెళ్ళేయిన కోలివుడ్ స్టార్ హీరోతో మృణాల్ డేటింగ్..?
ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయవాదులుగా మీ బాధ్యతలు మరింత పెరిగాయి.. మన ప్రభుత్వం హయాంలో మనం అనేకరకాలుగా న్యాయవాదులకు తోడుగా నిలిచాం.. లా నేస్తం పేరిట న్యాయవాదులకు అండగా నిలిచాం అని గుర్తుచేశారు వైఎస్ జగన్… అట్గడుగు వర్గాలకు తోడుగా నిలిచాం.. జీపీలు, ఏజీపీల్లో అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చాం.. న్యాయవాదుల సంక్షేమ నిధికోసం 100 కోట్లు కేటాయించాం.. ఇన్సూరెన్స్‌కోసం 1/3 వాటాగా మన ప్రభుత్వమే ఇచ్చింది.. ఇన్నిరకాలుగా మనం న్యాయవాదులకు మేలు చేశాం.. ఇప్పుడు ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్, సూపర్ సెవెల మాదిరిగా న్యాయవాదులను కూడా మోసం చేస్తున్నారు.. ఈ ప్రభుత్వానివి అన్నీ అబద్ధాలు, మోసాలే.. అన్ని రంగాలు తిరోగమనమే.. లా అండ్ ఆర్డర్ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది.. పురోగతి, అభివృద్ధి అన్నవి కనిపించడంలేదు.. అవినీతి విచ్చలవిడిగా ఉంది.. లిక్కర్‌లో అవినీతి విపరీతంగా ఉంది.. ఎమ్మార్పీ రేట్లకు మంచి అమ్ముతున్నారు.. ప్రతి గ్రామంలోనూ వీధికో బెల్టుషాపు.. బెల్టుషాపులకూ వేలం వేస్తున్నారు.. ఇల్లీగల్ పర్మిట్ రూములు నడుపుతున్నారు. అక్కడ కూడా ఎమ్మార్పీ రేట్లు కన్నా అధికంగా అమ్మతున్నారు. ఉచిత ఇసుక పేరిట దోపిడీ చేస్తున్నారు. ఉచిత ఇసుక ఎవరికి చేరుతోంది? అని నిలదీశారు.. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రావడంలేదు. కొంతమంది పోలీసులు దగ్గరుండి పేకాట క్లబ్బులు నడుపుస్తున్నారని ఆరోపించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
తాజావార్తలు
-
Kilauea volcano: 55వ సారి కిలావుయా అగ్ని పర్వత విస్పోటనం..
-
Ferrari Luce: భారత్‌లోకి ఫెరారీ తొలి ఎలక్ట్రిక్ కారు.. 2.5 సెకన్లలో 100 km/h స్పీడ్!
-
The Paradise OTT: ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
-
Pakistan Airspace Ban: భారత విమానాలపై పాకిస్తాన్ ఆంక్షలు.. గగనతల నిషేధం పొడిగింపు..
-
Tesla Roadster: టెస్లా ఫ్లయింగ్ కార్.. భారత్‌లో బుకింగ్స్ ప్రారంభం.. రూ.2.50 కోట్ల వరకు రిజర్వేషన్ అమౌంట్!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!