ఆగస్టు 1న 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల జాబితాను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 2023లో విడుదలైన సినిమాలకు గాను ఉత్తమ నటుడుగా బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, ఉత్తమ సపోర్టింగ్ నటుడిగా విజయ రాఘవన్, బెస్ట్ సినిమాగా భగవంత్ కేసరి సినిమాలు అవార్డ్స్ అందుకున్నాయి. అలాగే వివిధ విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని విజేతలుగా ప్రకటించింది నేషనల్ అవార్డ్స్ జ్యూరీ. అయితే ఈ అవార్డ్స్ నేషనల్ జ్యూరీకి తలనొప్పులు తెచ్చింది.
2023 బెస్ట్ యాక్టర్ గా జావాన్ సినిమాకు గాను షారుక్ ను వరించింది. అయితే షారుక్ కు ఈ అవార్డు ప్రకటించడం పట్ల మిశ్రమ స్పందన వస్తోంది. అదే ఏడాదిలో మళయాళంలో పృధ్వి రాజ్ సుకుమారన్ హీరోగా ఆడు జీవితం అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో పృధ్వి రాజ్ నటనకు అవార్డు దక్కకపోవడంతో జ్యూరీపై విమర్శలు వచ్చాయి. వాస్తవంగా చూస్తే ఆడుజీవితంలో పృద్వి రాజ్ సుకుమారన్ నటన అద్భుతంగా ఉంటుంది. బ్రతుకు తెరువుకు దుబాయ్ వెళ్లిన ఓ సామాన్యుడు అక్కడ ఎడారిలో అనుభవించిన నరకం క్యారక్టర్ లో పృద్వి రాజ్ అద్భుతంగా నటించాడు. ఇక జవాన్ సినిమాలో షారుక్ నటన గొప్పగా ఏమి ఉండదు. ఓ రొటీన్ రెగ్యులర్ కమర్షియాల్ సినిమాలో ఎలా ఉంటుందో అలా ఉంటుంది.
ఈ విషయమై నేషనల్ జ్యూరీని ప్రశించగా జ్యూరీ సభ్యుడు ప్రదీప్ నాయర్ స్పందించారు. ఆడు జీవితంలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటన ఆర్టిఫిషయల్ గా ఉంటుంది. సహజత్వ లేదని జ్యూరీ ఛైర్‌పర్సన్ అశుతోష్ గోవారికర్ తో పాటు సహా జ్యూరీ సభ్యులు పలువురు భావించడంతో పృథ్వీరాజ్ కు అవార్డు దక్కలేదని తెలిపారు. ఈ వ్యాక్యలపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. స్వప్రయోజనాల ముందు ఎంతటి అద్భుతమైన నటన కనబరించిన ఇలానే ఉంటుంది అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.