Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్.. క్వింటాల్‌కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tobacco Farmers: పొగాకు రైతులకు శుభవార్త చెబుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. పొగాకు ధరలు, రైతుల ఆర్థిక ఇబ్బందులు, నాణ్యత నిర్ధారణ వంటి అంశాలపై మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవి, డోలా బాల వీరాంజనేయస్వామి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పొగాకు రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేలా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి పొగాకు రైతుకు రూ.50 వేల వరకు వడ్డీలేని రుణం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రుణంపై రెండేళ్ల పాటు ఎలాంటి వడ్డీ ఉండదు. పొగాకు సాగులో రైతులకు ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
క్వింటాల్‌కు రూ.1,000 ప్రోత్సాహకం
ఇక, పొగాకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. కొనుగోలు చేసిన ప్రతి క్వింటాల్ పొగాకుకు రూ.1,000 రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకం అందించనుంది. రైతులకు నగదు చెల్లింపులు ఆలస్యం కాకుండా కొనుగోలు జరిగిన 9 రోజుల్లోనే ప్రోత్సాహక మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. మరోవైపు.. పొగాకు ధరలు, మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది రాష్ట్రంలో పొగాకు సాగును 80 మిలియన్ కిలోలకు పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్పత్తి, డిమాండ్ మధ్య సమతుల్యతను కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- CM Chandrababu: ఈసీ వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు..
- CRDA: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్..! గ్రామకంఠం మినహాయింపులపై CRDA క్లారిటీ..
- Viveka Murder Case: వివేకా కేసులో సునీల్ యాదవ్ సంచలన వాంగ్మూలం..!
నాణ్యతపై వ్యాపారుల ఇష్టారాజ్యానికి చెక్
పొగాకు నాణ్యత నిర్ధారణ విషయంలో వ్యాపారుల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఐదుగురు సభ్యులతో నాణ్యత నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ ద్వారా పొగాకు నాణ్యతను పారదర్శకంగా నిర్ధారించేలా చర్యలు తీసుకోనున్నారు. పొగాకు ధరల సమస్యపై మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవి, డోలా బాల వీరాంజనేయస్వామి సమీక్ష నిర్వహించారు. రైతులకు న్యాయమైన ధర, ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు మార్కెట్లో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?