Snake Bite Treatment in 108 ambulance: పాముకాటుకు అంబులెన్స్‌లోనే చికిత్స.. 108 వాహనాల్లో తొలిసారి ఇంజక్షన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Snake Bite Treatment in 108 ambulance: పాముకాటు బాధితులకు సత్వర వైద్యం అందించే దిశగా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాముకాటు బాధితులకు అవసరమైన ప్రాథమిక వైద్య చికిత్సను అంబులెన్స్‌లోనే అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
108 అంబులెన్స్‌లో ఏఎస్వీ ఇంజక్షన్లు
పాముకాటు బాధితులకు అత్యవసరంగా అందించాల్సిన యాంటీ స్నేక్ వెనం (ASV) ఇంజక్షన్లను తొలిసారిగా 108 అంబులెన్స్‌లలో అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో పాము కాటుకు గురైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించే సమయంలోనే అవసరమైన వైద్య సహాయం అందించే అవకాశం ఉంటుంది.
Also Read
- CM Chandrababu: ఏపీలో 25 నుంచి 38కి ఎంపీ సీట్లు.. డీలిమిటేషన్‌పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: కేబినెట్ భేటీ తర్వాత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. డీలిమిటేషన్, అమరావతి, పెట్టుబడులపై ఏమన్నారంటే?
- CBN Flight Technical Issue: చంద్రబాబు ప్రత్యేక విమానంలో సాంకేతిక సమస్య.. హెలికాప్టర్లో హైదరాబాద్‌కు..!
- Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై కేబినెట్ కీలక నిర్ణయం.. PPP విధానంలో అప్పగింత..!
పెరుగుతున్న పాముకాటు కాల్స్‌తో నిర్ణయం
రాష్ట్రంలో పాముకాటుకు సంబంధించిన 108 అత్యవసర కాల్స్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏర్పాట్లను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ముఖ్యంగా ఆసుపత్రికి చేరుకోవడానికి సమయం పట్టే ప్రాంతాల్లో ఈ చర్య బాధితులకు ఉపయోగపడే అవకాశం ఉంది.
ప్రజల విజ్ఞప్తులపై స్పందన
పాముకాటు ఘటనల్లో సకాలంలో చికిత్స అందక ప్రాణనష్టం సంభవించే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై ప్రభుత్వం స్పందించింది. పాముకాటు బాధితులకు అత్యవసర వైద్యం అందించడంలో ఆలస్యం తగ్గించేందుకు 108 వాహనాల్లోనే అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ ప్రయోగాత్మక విధానం ద్వారా పాముకాటు బాధితులను వీలైనంత త్వరగా వైద్య సంరక్షణలోకి తీసుకురావడంతో పాటు, ఆసుపత్రికి తరలించే సమయంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిబ్బందికి అవసరమైన సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
తాజావార్తలు
-
Human Trafficking Case: పేద మహిళలే టార్గెట్.. అక్రమ ఎగ్ డొనేషన్ దందాలో బయటపడుతున్న సంచలన నిజాలు!
-
Kishan Reddy: ప్రతి ఇంట్లో ఇప్పుడు ‘నషా ముక్త్ భారత్’ గురించే చర్చ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
-
CM Chandrababu: ఏపీలో 25 నుంచి 38కి ఎంపీ సీట్లు.. డీలిమిటేషన్‌పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Chiranjeevi: మందు తాగమని ఒత్తిడి చేశారు.. ఆంజనేయుడి భక్తుడినని చెప్పా
-
Rohit Sharma vs Jasprit Bumrah: రోహిత్‌కు పగ్గాలు.. బుమ్రా వైస్ కెప్టెన్సీకి నో!.. ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్..!
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్‌తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!