Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఇవాళ ముంబైలో పర్యటించనున్నారు.. టాటా గ్రూప్ ఛైర్మెన్ నటరాజన్ చంద్రశేఖరన్, ట్రాఫిగురా సీఈవో సచిన్ గుప్తా, ఈఎస్ఆర్ గ్రూప్ ESR group హెడ్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ సాదత్ షా, హెచ్‌పీఐఎన్‌సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇప్సితా దాస్ గుప్తా, బ్లూ స్టార్ లిమిటెడ్ Blue star Limited డిప్యూటీ ఛైర్మెన్ వీర్ అద్వానీతో సహా పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశంకానున్నారు మంత్రి నారా లోకేష్.. ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముంబైలో మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగనుంది.. సాయంత్రం ముంబైలో నిర్వహిస్తున్న 30వ సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొననున్నారు లోకేష్… ఇక, ఈ ఏడాది నవంబర్‌లో విశాఖ వేదికగా జరిగే పార్టనర్షిప్ సమ్మిట్ లో పాల్గొనాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు మంత్రి లోకేష్.. రాష్ట్రంలో కాగా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పినే ధ్యేయంగా.. వివిధ సంస్థలను పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానిస్తూ వస్తుంది ఏపీ సర్కార్.. ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పలు కీలక సంస్థలను రాష్ట్రానికి రండి అంటూ ఆహ్వానించిన విషయం విదితమే..
Read Also: Gold Rates: వామ్మో బంగారం ధరలు.. ఈరోజు ఎంత పెరిగిందంటే…!