పసిడి ప్రియులకు మళ్లీ షాక్. దీపావళి నాటికైనా బంగారం ధరలు తగ్గుతాయేమోనని అనుకుంటున్న వాళ్లకు గోల్డ్ రేట్స్ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. రోజురోజుకి జెట్ స్పీడ్‌లో ధరలు దూసుకుపోతున్నాయి. దీంతో బంగారం కొనాలంటేనే గోల్డ్ లవర్స్ హడలెత్తిపోతున్నారు. ఈరోజు తులం గోల్డ్‌పై రూ. 1,370 పెరగగా.. కిలో వెండిపై రూ.1,000 పెరిగి రికార్డ్ దిశగా దూసుకుపోతుంది.
ఇది కూడా చదవండి: Bihar Elections: ఈరోజే బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. సా.4 గంటలకు ఈసీ ప్రెస్‌మీట్
ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,370 పెరిగి రూ.1,20,770 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,250 పెరిగి రూ.1,10, 700 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,030 పెరిగి రూ.90, 580 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక కిలో వెండిపై రూ.1,000 పెరిగి.. రూ.1,56,000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక చెన్నైలో కిలో వెండిపై రూ. 1,66,000 దగ్గర ట్రేడ్ అవుతుండగా.. ముంబై, బెంగళూరు, ఢిల్లీలో మాత్రం రూ.1,56,000 దగ్గర అమ్ముడవుతోంది.
ఇది కూడా చదవండి: Israel-Hamas: నేడు ఈజిప్టు వేదికగా హమాస్-ఇజ్రాయెల్ కీలక చర్చలు.. బందీల విడుదలపై వీడనున్న ఉత్కంఠ