ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. 2025 - 26 వార్షిక బడ్జెట్‌తో పాటు.. వ్యవసాయ బడ్జెట్‌ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టింది.. ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే.. శాసన సభలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. రూ.48,340 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్ ప్రతిపాదనలను అసెంబ్లీ ముందు ఉంచారు..