CM Revanth Reddy: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ చెప్పినట్టు కులగణన చేశాం.. ఫిబ్రవరి 4వ తేదీ 2024 నాడు క్యాబినెట్లో తీర్మానం చేశాం.. మూడు కోట్ల 58 లక్షల మంది సర్వేలో పాల్గొన్నారు.. సర్వేలో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు.. 75 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు.. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కోరుతూ అన్ని పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.. బిల్లు ఆమోదానికి సహకరించిన సభ్యులకు అభినందనలు తెలిపారు ముఖ్యమంత్రి. కలిసి కట్టుగా మనం ఉన్నామని సమాజానికి సంకేతం ఇచ్చాం.. అలాగే, గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదన ఉపసంహరించుకున్నామని అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి తెలిపారు.
Read Also: PM Modi: అతనే నా ఫేవరేట్ ప్లేయర్.. బెస్ట్ టీమ్ అదే
అయితే, లీగల్ గా ఇబ్బంది అవుతుంది కాబట్టి గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటి నివేదిక పంపుతున్నాం.. రిజర్వేషన్ పెంచాలని.. బలహీన వర్గాలకు అండగా ఉండాలని మేం ఈ నిర్ణయం తీసుకున్నాం.. అందుకే ఫిబ్రవరి 4న సోషల్ జస్టిస్ డే నిర్వహిస్తున్నాం.. చట్టబద్ధత కోసం ఇవాళ సభలో బిల్లులు ప్రవేశ పెట్టాం.. ఏ వివాదాలకు పోకుండా.. బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. సభా నాయకుడిగా రిజర్వేషన్ సాధనకు నాయకత్వం వహిస్తాను.. కేసీఆర్ కి విజ్ఞప్తి చేస్తున్నాను.. సభకు రండి.. అన్ని రాజకీయ పార్టీలు కలిసి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోదాం.. చట్టాలు మనకు అనుకూలంగా రాసుకున్నవే.. 42 శాతం రిజర్వేషన్లు అమలు తీసుకొద్దామన్నారు. ప్రధాని దగ్గరికి పోదాం.. వీలైనంత తొందరగా… ప్రధానినీ అపాయింట్మెంట్ అడుగుతాం.. బీజేపీ ఎమ్మెల్యేలు, కిషన్ రెడ్డి ద్వారా ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేయించండి అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: TTD: తెలంగాణ ప్రజాప్రతినిధులకు శుభవార్త.. సిఫార్సు లేఖలపై టీటీడీ కీలక నిర్ణయం
ఇక, రాహుల్ గాంధీని కలిసే విషయం మా పీసీసీ తీసుకుంటారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. సుప్రీం కోర్టు, జనాభా ఎంతో తేల్చకుండా రిజర్వేషన్ ఇవ్వలేమన్నది.. అందుకే తెలంగాణలో సర్వే చేశాం.. లెక్కలు నూటికి నూరు శాతం కరక్టే.. బలహీన వర్గాలు 56.3 శాతం జనాభా ఉంది.. ఇవాళ తీర్మానం కాదు చట్టం చేశాం.. కామారెడ్డి తీర్మానానికి మేం కట్టుబడి ఉన్నాం.. బీసీలు పాలితులు కాదు… పాలకులు అవ్వాలి అని కోరారు. అందుకు మేం కృషి చేస్తున్నాం.. మాకు వచ్చిన నాలుగు ఎమ్మెల్సీలలో ఎస్సీ, ఎస్టీ, బీసీకి అవకాశం కల్పించామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.