AP Deputy CM: నేడు అరకు లోయలో “మహా సూర్య వందనం” నిర్వహిస్తున్నారు. సుమారు 20 వేల మంది గిరిజన విద్యార్థులతో 108 సార్లు సూర్య నమస్కారాలు చేయించనున్నారు. వరల్డ్ రికార్డు నమోదు అయ్యే అవకాశం ఉంది. “మహా సూర్యవందనం”కు ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్, గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి హాజరుకానున్నారు.
Read Also: SRH vs GT: సన్‌రైజర్స్ పరాజయాల పరంపర.. గుజరాత్ హ్యాట్రిక్ విజయం!
అయితే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు, రేపు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో పర్యటించనున్నారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి 8 గంటలకు విశాఖపట్నం చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో అరకు లోయ నియోజకవర్గంలోని డుంబ్రిగుడ మండలం చాపరాయికి ఉదయం 11 గంటలకు చేరుకోనున్నారు. దీనికి అవతల వైపున సుమారు 3 కిలో మీటర్ల దూరంలో ఉన్న పెదపాడు గ్రామాన్ని సైతం ఆయన సందర్శించి, రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, అక్కడే, ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు.
Read Also: NKR : అర్జున్ S/O వైజయంతి నైజాం డీల్ క్లోజ్
ఇక, అనంతరం డుంబ్రిగుడకు చేరుకుంటారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అల్లూరి జిల్లాకు మంజూరు చేసిన సుమారు 200 రోడ్ల నిర్మాణాలను వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత అరకులోయ వెళ్లి ఏపీటీడీసీ హరిత రిసార్ట్స్‌లో రాత్రికి బస చేసే అవకాశం ఉంది. ఇక, రేపు (మంగళవారం) ఉదయం 10 గంటలకు అరకులోయ మండలం సుంకరమెట్ట సమీపంలోని కాఫీ తోటలకు వెళ్లి.. అటవీ శాఖ చెక్కలతో నిర్మించిన కాలిబాట వంతెనను ప్రారంభోత్సవం చేయనున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో పవన్ విశాఖపట్నం ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కుకు చేరుకొని ఎకో టూరిజంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.