అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలోని రొంపల్లి పంచాయతీ గిరిజన ‘గూడెం’లో తొలిసారి విద్యుత్ వెలుగులు వెలిగాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత మొదటిసారి విద్యుత్ కనెక్షన్ వచ్చింది. 17 కుటుంబాలు నివసించే గూడెంకి 9.6 కి.మీ పొడవున 217 విద్యుత్ స్తంభాలను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికీ ప్రభుత్వం తరఫున 5 బల్బులు, ఒక ఫ్యాన్ అందించారు. సుమారు రూ.80 లక్షల వ్యయంతో పర్వత అడవి ప్రాంతంలో…
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం కేంద్రంలో ఉన్న గాంధీనగర్ కు చెందిన ఎం.నాగజ్యోతి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహంచిన మెగా డీఎస్సీలో మంచి మార్కులు సాధించింది.. 74.40 మార్కులు రాబట్టింది.. మంచి మార్కులతో టీచర్ ఉద్యోగానికి అర్హురాలు అయినప్పటికీ.. క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఆమె.. విశాఖలోని ఓ ఆసుపత్రిలో మృతి చెందింది.
Kidnap Mystery: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అల్లూరి జిల్లా గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగి కిడ్నాప్ మిస్టరీ వీడింది. బలవంతపు పెళ్లి కోసమే కిడ్నాప్ జరిగినట్లు పోలీసులు తేల్చారు. ప్రధాన నిందితుడితోపాటు అతనికి సహకరించిన మరో నలుగురిని అరెస్ట్ చేశారు. కిడ్నాపర్ల చెర నుంచి ఆమెను విడిపించారు. రంపచోడవరం ప్రాంతం.. దేవీపట్నం మండలం, శరభవరం సచివాలయంలో సోయం శ్రీసౌమ్య విలేజ్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తోంది. ఆమె విధుల్లో ఉండగానే కొంత మంది దుండగులు ఇన్నోవా కారులో వచ్చి…
Godavari Floods: గోదావరి ఉగ్రరూపంతో అల్లూరి జిల్లాలోని విలీన మండలాల్లో వరద భయం నెలకొంది. కూనవరం, శబరి - గోదావరి సంగమం వద్ద నీటిమట్టం పెరగడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేస్తున్నారు. ఇళ్లల్లోని సామగ్రితో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.
అల్లూరి జిల్లా అరకులోయ మండలం గన్నెల పంచాయితీ డప్పుగుడ గ్రామంలో గడబంటు భీమన్న(46) హత్యకు గురయ్యాడు. హత్య చేసిన చిట్టపురి పొల్లు అనే వ్యక్తి హత్యకు వాడిన కత్తితో సహా అరకులోయ పోలీస్ స్టేషన్‌లో వెళ్లి లొంగిపోయాడు. హత్యకు ఆర్థిక వ్యవహారాలే కారణమని డిఎస్పీ షేక్ సహాబాజ్ అహమద్ తెలిపారు. ఓ వైపు హత్యకు ఆర్థిక వ్యవహారాలే కారణమని చెబుతుండగా.. గ్రామస్థులు, బంధువులు మాత్రం హత్యకు చేతబడే కారణమని చెపుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి.. చలితో ప్రజలు వణికిపోతున్నారు.. ఇక, అల్లూరి జిల్లా ఏజెన్సీలో చలి వణుకు పుట్టిస్తుంది. రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కి పడిపోయాయి. ఏజెన్సీ వ్యాప్తంగా దట్టమైన పొగమంచు కురుస్తుంది.