SRH vs GT: సన్‌రైజర్స్ పరాజయాల పరంపర.. గుజరాత్ హ్యాట్రిక్ విజయం!
- సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయాల పరంపర
- వరుసగా నాలుగో ఓటమిని చవిచూసిన ఎస్‌ఆర్‌హెచ్
- గుజరాత్ టైటాన్స్ హ్యాట్రిక్ విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) పరాజయాల పరంపర కొనసాగుతోంది. సొంతగడ్డపై కూడా తేలిపోతున్న ఎస్‌ఆర్‌హెచ్.. వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 7 వికెట్ల తేడాతో చిత్తయింది. ఐపీఎల్ 2025లో ఇప్పటికే 5 మ్యాచ్‌లు ఆడిన ఎస్‌ఆర్‌హెచ్‌కు ప్లేఆఫ్స్ రేసులో ప్రతి గేమ్ కీలకంగా మారింది. మరో 2-3 ఓటములు ఎదురైతే ప్లేఆఫ్స్ ఆశలు వదులుకోవాల్సిందే. మరోవైపు బౌలింగ్, బ్యాటింగ్‌లో అదరగొట్టిన గుజరాత్ హ్యాట్రిక్ విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. గుజరాత్ టైటాన్స్ పేసర్ మహ్మద్ సిరాజ్ (4/17) దెబ్బకు 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులే చేసింది. నితీశ్ కుమార్ రెడ్డి (31; 34 బంతుల్లో 3×4) టాప్ స్కోరర్. ట్రావిస్ హెడ్ (8), అభిషేక్ శర్మ (18; 16 బంతుల్లో 4×4), ఇషాన్ కిషన్ (17; 14 బంతుల్లో 2×4) త్వరగానే అవుట్ అయ్యారు. ఆపై గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఎస్‌ఆర్‌హెచ్ 10 ఓవర్లలో 3 వికెట్లకు 64 పరుగులే చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (27; 19 బంతుల్లో 2×4, 1×6) కూడా భారీ షాట్లు ఆడలేక ఇబ్బంది పడ్డాడు. 19వ ఓవర్లో అనికేత్‌వర్మ (18; 14 బంతుల్లో 2×4), సిమర్‌జీత్ సింగ్ (0)లను సిరాజ్ ఔట్ చేశాడు. అయితే ఇషాంత్ శర్మ వేసిన చివరి ఓవర్లో ప్యాట్ కమిన్స్ (22 నాటౌట్; 9 బంతుల్లో 3×4, 1×6) చెలరేగడంతో సన్‌రైజర్స్ 150 పరుగుల మార్కును దాటింది.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. సాయి సుదర్శన్ (5), జోస్ బట్లర్ (0) త్వరగానే అవుట్ అయ్యారు. 4 ఓవర్లలో 17/2తో కష్టాల్లో పడింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వాషింగ్టన్ సుందర్ (49; 29 బంతుల్లో 5×4, 2×6) రెచ్చిపోయాడు. బౌండరీలు, సిక్సర్లతో మ్యాచ్ గమనాన్నే మార్చేశాడు. దాంతో పవర్ ప్లే ముగిసేసరికి గుజరాత్ 48/2తో నిలిచింది. శుభ్‌మన్ గిల్ (61 నాటౌట్; 43 బంతుల్లో 9×4) కూడా జోరందుకోవడంతో గుజరాత్ లక్ష్యం దిశగా నడిచింది. ఇద్దరు మూడో వికెట్‌కు 90 పరుగులు జోడించి గుజరాత్‌ను మెరుగైన స్థితికి చేర్చాడు. సుందర్ అవుట్ అయ్యాక రూథర్‌ఫర్డ్ (35 నాటౌట్; 16 బంతుల్లో 6×4. 1×6), ఫీల్ కలిసి మిగతా పని పూర్తి చేశారు. 16.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయిన గుజరాత్ హ్యాట్రిక్ విజయం ఖాతాలో వేసుకుంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!