కోడి రామకృష్ణ కూతురు టాలీవుడ్ ఎంట్రీ !

ప్రముఖ దివంగత టాలీవుడ్ దర్శకుడు కోడి రామకృష్ణ కూతురు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. అయితే హీరోయిన్ గానో, లేదా నటిగానే కాదు… నిర్మాతగా ఎంట్రీ ఇవ్వబోతోంది. కోడి దివ్య దీప్తి నిర్మాతగా మారడానికి సిద్ధంగా ఉంది. ఈ మేరకు దివ్య తన ప్రొడక్షన్ హౌస్ కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ ను ప్రారంభించింది. ఆమె తొలి ప్రొడక్షన్ పై జూలై 15న అధికారిక ప్రకటన రానుంది. నిర్మాతగా దివ్య తొలి చిత్రం దర్శకుడు కార్తీక్ శంకర్ తో నిర్మించనుంది. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను రేపు ప్రకటించనున్నారు.

Read Also : “రాధే శ్యామ్” ఆలస్యంగా రాబోతున్నాడా ?

ఇక కోడి రామకృష్ణ దర్శకుడిగా టాలీవుడ్ లో తనదైన శైలిలో సినిమాలను తెరకెక్కించి చెరగని ముద్రను వేసుకున్నారు. “ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య” సినిమాతో దర్శకునిగా తన కెరీర్ ప్రారంభించిన ఆయన తరువాత స్టార్ హీరోలు అందరి చిత్రాలకూ దర్శకుడిగా పని చేశారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలను రూపొందించారు. తెలుగులో అమ్మోరు, అరుంధతి వంటి చిత్రాలతో తెరపై భక్తిని కురిపించారు. దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న తరువాత నటుడిగా కూడా ప్రయత్నించారు. 2019 ఫిబ్రవరి 22న ఆయన అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఇప్పుడు ఆయన కూతురు నిర్మాతగా మారుతుండడం విశేషం.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-