Adimulapu Suresh Fires On Chandrababu Naidu: టీడీసీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు చవకబారు రాజకీయాలు అందరికీ తెలుసని మండిపడ్డారు. పేదవాళ్లకు ఇళ్లు ఇవ్వటానికి మీరు వ్యతిరేకమా? పేదలకు భూములు ఇవ్వవద్దని చట్టం తెస్తారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. అమరావతిలో పేదలకు భూములు ఇవ్వాలని సీఎం జగన్ ఆలోచన చేశారని, రాజ్యాంగ వ్యతిరేకంగా ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. సీఆర్దీఏ చట్టం ప్రకారమే పేదలకు భూములు అందజేయాలని జగన్ అనుకున్నారని అన్నారు. అమరావతిలో కేవలం ధనికులే ఉండాలా అని నిలదీశారు.
పేదలకు మంచి జరుగుతుందనుకుంటే కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. అయినా తాము వెనక్కు తగ్గేది లేదని, అన్నీ అనుమతులు తీసుకుని ముందుకు వెళ్తామని తేల్చి చెప్పారు. చంద్రబాబుకు శవాలపై రాజకీయం చేయటం వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. చంద్రబాబు యర్రగొండపాలెం పర్యటనకు వచ్చే ముందు.. దళితులపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పి రావాలని కోరామన్నారు. ఆయన పర్యటన సమయంలో శాంతియుతంగా నిరసన తెలపాలని అనుకున్నామన్నారు. అయితే.. తమ క్యాంప్ ఆఫీస్ దగ్గరకు రాగానే, చంద్రబాబు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారన్నారు. వాళ్ళు ఉద్దేశ్యపూర్వకంగా దాడి చేశారన్నారు. రాళ్లు ఎవరు నువ్వారో అందరూ చూశారని, ఈ ఘటనపై పూర్తి విచారణ చేయిస్తామని చెప్పారు.
GVL Narasimha Rao: కొడాలి నానిపై జీవీఎల్ పరోక్ష కామెంట్లు.. నోరు అదుపులో పెట్టుకోవాలి
అంతకుముందు.. అమరావతి లో ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఆదిమూలపు సురేష్ అన్నారు. పేద ప్రజలకు సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ఎంత దూరమైనా వెళ్తామని తెలిపారు. అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కోర్టులో కేసులు వేశారని, అమరావతి రైతుల ముసుగులో టీడీపీ నాయకులు కోర్టులో కేసులు వేశారని ఆరోపించారు. అమరావతిలో టీడీపీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూశారన్నారు. త్వరలోనే అమరావతిలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.
Sajjala : ఎంపీ అవినాష్ రెడ్డిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు..