కర్నూలు జిల్లా పత్తికొండలో సామాజిక సాధికారక బస్సు యాత్రలో ఉపముఖ్యమంత్రి అంజద్ భాష , మంత్రులు ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మీడియా సమావేశంలో మాట్లాడారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం సామాజిక, సాధికార యాత్రలో మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజంలో అందరికీ సమానత్వం రావటమే సాధికారత అని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ చట్టసభలలో బీసీ, ఎస్సీ, మైనారిటీలకు ప్రాధాన్యత రావడమన్నారు.
సంక్షేమం, అభివృద్ధి జగన్ ప్రభుత్వ ముఖ్య లక్ష్యాలు అని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. యాత్రకు వెళ్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన చెప్పారు.
విశాఖ పట్నంలో మంత్రి ఆదిమూలపు సురేశ్ అధ్యక్షతన VMRDAలో జరిగిన సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి సురేశ్ మాట్లాడుతూ.. సమీప భవిష్యత్ లో సరికొత్త విశాఖను చూడబోతున్నాం అని ఆయన పేర్కొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆదిమూలపు సురేష్ విరుచుకుపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వెలిగొండ ప్రాజెక్టు గురించి పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు నంగనాచి కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు.