Justice Surya Kant: ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ గవాయ్ పదవీకాలం ఈ ఏడాది నవంబర్ 23న ముగియనుంది. తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి సూర్యకాంత్ను జస్టిస్ గవాయ్ సిఫార్సు చేశారు. ఈ సిఫార్సు ఆమోదం పొందితే నవంబర్ 24న జస్టిస్ సూర్యకాంత్ భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా విధులను స్వీకరించవచ్చు. ఆయన తన పదవీకాలం ముగిసే వరకు, అంటే ఫిబ్రవరి 9, 2027 వరకు సీజేఐగా కొనసాగవచ్చు. READ ALSO:…
Justice Surya Kant: భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవై ప్రమాణ స్వీకారం చేసిన ఐదు నెలల తర్వాత, ఆయన వారసుడిని నియమించే ప్రక్రియ ప్రారంభమైంది. తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ సూర్యకాంత్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీజేఐ గవాయ్ పదవీకాలం ఈ ఏడాది నవంబర్ 23తో ముగుస్తోంది. రేపటిలోగా తన వారసుడిని సిఫారసు చేయమని కోరుతూ ప్రభుత్వం గవాయ్కి లేఖ రాసినట్లు సమాచారం. గవాయ్ నవంబర్ 23, 2025న పదవీ…
Supreme Court: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా సుప్రీంకోర్టులో విపక్షాలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’ కార్యక్రమం ద్వారా ఫేక్ ఓటర్లను తొలగించేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ఈ చర్యను కాంగ్రెస్, ఆర్జేడీ సహా విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ సుప్రీంని ఆశ్రయించాయి.
CJI BR Gavai: శ్రీ మహా విష్ణువుపై భారత ప్రధాన న్యాయమూర్తి(CJI) బీఆర్ గవాయ్ వ్యాఖ్యల అనంతరం, సోమవారం సుప్రీంకోర్టులో ఆయనపై దాడి జరిగింది. ఓ న్యాయవాది ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన తర్వాత సీజేఐ గవాయ్ మంగళవారం సోషల్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. సీజేఐ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం జిల్లా కోర్టు న్యాయమూర్తుల నియామకం- పదోన్నతులకు సంబంధించిన అంశాన్ని విచారిస్తుండగా…
సుప్రీం ధర్మాసనం..‘‘ఇది పూర్తిగా ప్రచార ప్రయోజన వ్యాజ్యం. వెళ్లి దేవుడినే ఏదైనా చేసుకోమని అడగండి. మీరు విష్ణువు భక్తులని మీరు అనుకుంటే, మీరు ప్రార్థన చేసి, కొంత ధ్యానం చేయండి’’ అని సీజేఐ అన్నారు. ఈ ఆలయం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికార పరిధి కిందకు వస్తుందని పేర్కొంటూ పిటిషన్ను తోసిపుచ్చింది.
Supreme Court: సుప్రీంకోర్టు బిల్లులను గవర్నర్లు పెండింగ్లో పెట్టే అంశాన్ని విచారిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. నేపాల్, బంగ్లాదేశ్లో జరిగిన హింసాత్మక సంఘటనలను ప్రస్తావించింది. బుధవారం సుప్రీంకోర్టులో ఏప్రిల్ 12న ఇచ్చిన ఉత్తర్వులపై విచారణ జరిగింది. రాష్ట్రాలు రూపొందించి బిల్లును క్లియర్ చేయడానికి రాష్ట్రపతి, గవర్నర్లకు గడువును నిర్ణయిస్తూ సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులను ఇచ్చింది.
CJI DY Chandrachud: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎల్లుండి పదవి విరమణ చేయనున్న జస్టిస్ డివై చంద్రచూడ్ కు ఇవాళ సీజేఐగా చివరి వర్కింగ్ డే. ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం సుప్రీం కోర్టులో చంద్రచూడ్ రిటైర్మెంట్ ఫంక్షన్ జరగనుంది.
Supreme Court: భారత న్యాయ చరిత్రలో మరో ముందడుగు పడింది. సుప్రీంకోర్టులోని అన్ని బెంచ్ లలో జరిగే వాదనలు ప్రజలంతా వీక్షించేలా ఏర్పాట్లు చేయబోతున్నట్లు ప్రకటించింది. కొత్తగా రూపొందించిన సాప్ట్ వేర్ తో ఈ ప్రయోగాత్మక పరిశీలన చేయబోతున్నట్లు తెలిపింది.
MLC Kavitha: సుప్రీం కోర్టులో నేడు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్ కోసం సుప్రీం కోర్టును కవిత ఆశ్రయించిన విషయం తెలిసిందే.