కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డి అన్నారు. అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్యంగా ఉన్నారు.. అవినాష్ రెడ్డిని సీబీఐ సాక్ష్యం చెప్పడానికి పిలిచిన ప్రతిసారి వెళ్లారు.. సీబీఐ అవినాష్ రెడ్డిని నిందితుడు అని ఎప్పుడైతో చెప్పిందో.. అనుమానంతో ముందస్తు బెయిల్ కోసం వెళ్లారు అని సజ్జల అన్నారు. సీబీఐ పిలిచినాక రేపు అయినా విచారణకు అవినాష్ రెడ్డి వెళతారని అన్నారు. పులివెందుల వెళ్ళటానికి సీబీఐ అనుమతి ఉందో లేదో తెలియదు అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డి అన్నారు.
Also Read : Sundar Pichai: గూగుల్ సీఈవో సుందర్ పిచై ఇల్లునే కొనుగోలు చేసిన నటుడు.. ఎవరో తెలుసా..?
తల్లికి ఆరోగ్యం బాగోలేదని సీబీఐకి సమాచారం ఇచ్చి వుంటారు అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డి అన్నారు. వివేకానంద రెడ్డి హత్య చేశామని చెప్పిన వ్యక్తి బయట ఉన్నారు.. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు… సెటిల్ మెంట్ చేస్తారు.. మీడియాపై దాడి దురదృష్టం.. అవినాష్ రెడ్డికి తెలిసి జరిగి ఉండదు అని ప్రభుత్వ సలహాదారు సజ్జల చెప్పారు. దాడికి కారణం అయిన అంశాలు కూడా విచారించాలి ఆయన అన్నారు. మీడియా వెంటపడుతుంటే అవినాష్ రెడ్డి అభిమానులు స్పందించి ఉండొచ్చు అని చెప్పుకొచ్చారు.
Also Read : Dasyaam Vinay Bhaskar : కుక్కల దాడిలో బాలుడి మృతి.. పరిహారం ప్రకటించిన ప్రభుత్వ చీఫ్ విప్
సీబీఐ అరెస్ట్ చేయాలి అనుకుంటే ఎన్ని రోజులు తప్పించుకుంటారు.. వివేకా హత్య కేసులో అవినాష్ పాత్ర ఉంటే చంద్రబాబు వదిలేవారా? అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డి అన్నారు. ఏమి జరిగిందో వీళ్లకు తెలిసి ఉంటే సీబీఐ వీళ్ళని పిలిచి విచారించాలి అని ఆయన అన్నారు.