ఏంటీ ఇలాంటి వారుకూడా ఉంటారు మరీ.. ఇది చూస్తే నవ్వకుండా ఉండలేరు.. అంటూ య్యుట్యూబ్ థంబ్‌నైల్‌లా అనిపించిందా.. మే బీ అయ్యిండొచ్చు.. కానీ ఈ వార్త చదివితే మాత్రం మీరు నవ్వకుండ ఉండలేరు.. కనీసం ఓ చిన్న నవ్వైనా రాక మానదు.. అంతేకాకుండా ఇలాంటి వారుకూడా ఉంటారా.. అనే ఆలోచన కూడా మీ బుర్రలో రాక మానదు.. ఇంతకు విషయం ఏంటంటే.. మామూలుగా ఉద్యోగం చేసేవారు.. సెలవు కావాలంటే.. బాస్‌కు లీవ్ ఎందుకు కావాలో చెప్తూ లీవ్ రిక్వెస్ట్ పెడుతాం.. చెప్పలేని పరిస్థితి ఉంటే.. ఏదో సాకు చెబుతూ.. లీవ్ అడుగుతాం.. కానీ ఓ వ్యక్తి తన కు బాస్‌కు.. ‘సార్ నాకు లీవ్ ఒక రోజు లీవ్ కావాలి.. అది కూడా వేరే కంపెనీలో జాబ్ ఇంటర్వ్యూ కోసం’ అని లీవ్ రిక్వెస్ట్ పెట్టాడు.
అవునా.. అనుకుంటున్నారా.. అవునండీ.. ఈ విషయాన్ని సదరు బాసే ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తూ.. తన జూనియర్లు చాలా స్వీట్ అని సాహిల్ అనే ట్విట్టర్ హ్యాండిల్ ఆ పోస్టు షేర్ చేస్తూ పేర్కొంది. ఇదిలా ఉంటే.. మరో వ్యక్తి తన బాస్‌కు రిజైన్ లెటర్‌ను షార్ట్ అండ్ స్వీట్‌గా పంపించాడు. అది ఎలాగంటే.. డియర్ సార్ అని, రాజీనామా గురించి అని పేర్కొని.. సింపుల్‌గా బై బై సార్ అని రాసి ఉంది. చివరగా సంతకం ఉంది. దీనికి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోపై నెటిజన్లు ఫుల్ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. మీరు ఓ లుక్కెయండి.
My juniors are so sweet, asking me for leave to attend an interview. 😉😁 pic.twitter.com/gcBELHIuAG
— Sahil (@s5sahil) June 15, 2022