Sai Kiran :`నువ్వే కావాలి` సినిమా గుర్తుందా.. అప్పట్లో యూత్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకున్న సినిమా. అందులో అనగనగా ఓ ఆకాశం ఉంది పాట అందరినీ ఉర్రుతలూగించింది. ఆ సినిమాలో తరుణ్ తో కలిసి నటించాడు సాయి కిరణ్. ఆ సినిమాలో చాక్లెట్ బాయ్ లుక్ తో అమ్మాయిల మనసు దోచేశాడు. అంతా సాయి కిరణ్ పెద్ద స్టార్ అవుతాడని భావించారు. కానీ తరుణ్ వెలిగినంతగా సాయికిరణ్ ఇండస్ట్రీలో వెలగలేదు. ఇక తరుణ్ ఇటీవల సినిమాల్లో కనిపించకపోవడానికి కారణలేమిటన్నది అందరికీ తెలుసు. అయితే సాయికిరణ్ మాత్రం తెలుగు సినిమాల్లో సహాయక పాత్రలు చేస్తున్నారు. అలాగే అటు మలయాళ సినిమాల్లోనే నటిస్తూ అక్కడి వారికి కూడా సుపరితులుగా ఉన్నారు. సాయి కిరణ్ మలయాళ సినిమా.. బుల్లి తెర ఇండస్ట్రీలో సుపరిచితమైన ముఖం. ఆయన టీవీ సీరియల్ వానంబాడితో మంచి పేరు తెచ్చుకున్నారు.
Read Also:Eknath Shinde: హోం మంత్రి పదవి కావాలని ఏక్‌నాథ్ షిండే డిమాండ్..
ఇటు తెలుగు సినిమాలు, అటు టీవీ సీరియల్స్ రెండింటిలోనూ యాక్టివ్‌గా ఉన్న సాయి కిరణ్ (46) ఇటీవలి సీరియల్‌లో గాయకుడు మోహన్ కుమార్‌గా నటించి మలయాళీ అభిమానుల అపారమైన ప్రేమను దక్కించుకున్నాడు. సోషల్ మీడియాలో కామిక్ రీల్స్ చేస్తూ అతడు యాక్టివ్ సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూ యెన్సర్ గా కూడా ఉన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో తన రెండో పెళ్లి గురించి వెల్లడించాడు. తాజా సమాచారం మేరకు అతడు సీరియల్ నటి స్రవంతిని పెళ్లాడనున్నాడు. ఈ శనివారం(07 డిసెంబర్) అంటే ఈ రోజు ఈ జంట వివాహం జరగనుందని తెలిసింది. సాయికిరణ్ కి ఇది రెండో పెళ్లి. మొదటి భార్య వైష్ణవితో మ్యూచువల్ అండర్ స్టాండింగుతో డివోర్స్ తీసుకున్నారు. ఈ జంటకు ఒక కుమార్తె కూడా ఉంది.
Read Also:Pushpa 2: “సర్.. నేను పుష్ప 2 సినిమాకు వెళ్తున్నా..” మేనేజర్‌కి ఉద్యోగి మెసేజ్