కర్నూలు జిల్లా పర్యటనలో పవన్ కళ్యాణ్ కొత్తగా కనిపించారు. ఆయన చేతికి రెండు ఉంగరాలు ఉండటాన్ని గమనించి అందరూ ఆసక్తికరంగా చర్చించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రెండేళ్లలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని.. అందుకే ఈసారి ఆయన జ్యోతిష్యాన్ని నమ్ముకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఏపీలో పొత్తులపై కీలక చర్చ నడుస్తోంది. ఈ తరుణంలో పవన్ చేతికి కొత్తగా రెండు ఉంగరాలు కనిపించడం.. అవి జెమ్ స్టోన్స్ పొదిగిన ఉంగరాలు కావడంతో జ్యోతిష్యానివే అని అందరూ విశ్వసిస్తున్నారు.
మరోవైపు కర్నూలు పర్యటనలో టీడీపీతో పొత్తుపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తుపై టీడీపీ ఆహ్వానిస్తే ఏం బదులిస్తారని మీడియా ప్రతినిధులు అడగ్గా.. బలమైన ఆలోచన విధానంతో ముందుకు వెళ్తామని పవన్ తప్పించుకున్నారు. ఏదేమైనా ప్రజా సంక్షేమం, రాష్ట్ర భవిష్యత్‌కు తాము ప్రాధాన్యం ఇస్తామని పవన్ స్పష్టం చేశారు. ఏదో ఒక అద్భుతం జరుగుతుందని భావిస్తున్నట్లు పవన్ తెలిపారు. బీజేపీతో పొత్తు కొనసాగుతోందని క్లారిటీ ఇచ్చారు. కాగా అటు ప్రతిపక్షాలు పొత్తులు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో తమను దెబ్బ తీయాలని సన్నాహాలు చేస్తుండటాన్ని ముందుగానే గమనించి అధికార పార్టీ వైసీపీ విమర్శలు చేస్తోంది. దాదాపు మంత్రుందరూ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై విమర్శలు చేస్తున్నారు.
Pawan Kalyan: ఏపీ భవిష్యత్ కోసం ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలి