కర్నూలు జిల్లా సిరివెళ్లలో కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు విషయాలపై కులంకషంగా మాట్లాడారు. తాను కుల, మతాలకు అతీతంగా ఉంటానని.. ముస్లింలకు అండగా ఉంటానని పవన్ స్పష్టం చేశారు. ఇస్లాం టోపీలు పెట్టుకుని రాజకీయాలు చేసేవాడిని కాదని.. వైసీపీ వాళ్ల తరహాలో అలయ్ బలయ్ చేయలేనని ఎద్దేవా చేశారు. ముస్లింలు పనిచేసుకోవాలంటే ఇప్పుడు లంచం ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఏ కులంలో పుట్టాలో మన చేతుల్లో లేదని.. మానవత్వం చూపే…
కర్నూలు జిల్లా పర్యటనలో పవన్ కళ్యాణ్ కొత్తగా కనిపించారు. ఆయన చేతికి రెండు ఉంగరాలు ఉండటాన్ని గమనించి అందరూ ఆసక్తికరంగా చర్చించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రెండేళ్లలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని.. అందుకే ఈసారి ఆయన జ్యోతిష్యాన్ని నమ్ముకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఏపీలో పొత్తులపై కీలక చర్చ నడుస్తోంది. ఈ తరుణంలో పవన్ చేతికి కొత్తగా రెండు ఉంగరాలు కనిపించడం.. అవి జెమ్ స్టోన్స్ పొదిగిన ఉంగరాలు కావడంతో…
కర్నూలు జిల్లా రైతు భరోసా యాత్రలో పవన్ కళ్యాణ్ పొత్తులపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని.. కానీ ఏపీ భవిష్యత్ కోసం ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలని పవన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే అంతిమంగా ప్రజలకే నష్టం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఉపయోగపడేలా పొత్తులు ఉండాలని.. పొత్తులపై చర్చలు అవసరమని.. పార్టీలు చాలా విశాల దృష్టితో ఆలోచించాలని పవన్ తెలిపారు. ఏపీ నిర్మాణానికి అన్ని పార్టీలు కృషి…