HYDRA : హైడ్రా టార్గెట్ పేద, మధ్య తరగతి మాత్రమేనా అని ప్రశ్న.. ప్రముఖులకు ఈ రాష్ట్రంలో ప్రత్యేక చట్టం ఉందా అని ప్రశ్నించిన హైకోర్టు.. మియాపూర్, దుర్గంచెరువు ఆక్రమణల పరిస్థితి ఏంటి? అందరికీ ఒకేలా న్యాయం జరిగితే హైడ్రా ఏర్పాటుకు సార్థకత అని పేర్కొన్న హైకోర్టు హైడ్రా కమిటీ విధానంపై మరోసారి హైకోర్టు తీవ్రంగా స్పందించింది. పేద, మధ్య తరగతి ప్రజలకే హైడ్రా లక్ష్యమా? అనే ప్రశ్నను లేవనెత్తింది. ప్రముఖులకు ప్రత్యేక చట్టం ఉందా? అనే సందేహాన్ని హైకోర్టు వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు కొందరిపై మాత్రమే ఎందుకు వర్తిస్తున్నాయి? అన్నది హైకోర్టు ప్రశ్నించింది.
మియాపూర్, దుర్గం చెరువు పరిసరాల్లో అక్రమ నిర్మాణాల పరిస్థితి ఏమిటో స్పష్టత ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ప్రాంతాల్లో ఎంతమంది అక్రమంగా స్థలాలు ఆక్రమించుకున్నారు? ఏయే నిర్మాణాలు అనుమతులు లేకుండా నిర్మించబడ్డాయి? అనే అంశాలను తేల్చాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా కమిటీ వాస్తవంగా అందరికీ సమానంగా న్యాయం చేస్తుందా? లేదా? అనే అంశంపై హైకోర్టు సందేహం వ్యక్తం చేసింది. ప్రబల వర్గాలు, అధికార పరిధిలో ఉన్నవారికి హైడ్రా ఏమాత్రం నష్టం కలగకుండా ఉంటే, సామాన్య ప్రజలపై మాత్రం కఠినంగా వ్యవహరించడమేమిటని ప్రశ్నించింది.
హైడ్రా పనితీరు అశాజనకంగా ఉందని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వం హైడ్రా ఏర్పాటును సమర్థించవచ్చు గానీ, దీనివల్ల ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలంటూ వ్యాఖ్యానించింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హైడ్రా కమిటీ పనితీరును సమీక్షించాల్సిన అవసరం ఉందని సూచించింది. ‘మీరాలం’ చెరువు పరిసరాల్లో ఆక్రమణలపై స్పష్టత కోసం హైకోర్టు ఉమ్మడి సర్వే చేపట్టాలని ఆదేశించింది. సంబంధిత అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తహసీల్దార్ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ ఫాతిమా అనే మహిళ కోర్టును ఆశ్రయించగా, విచారణ సందర్భంగా హైకోర్టు హైడ్రాపై ఘాటుగా స్పందించింది.
ఈ కేసుపై తదుపరి విచారణలో హైకోర్టు మరింత వివరమైన సమగ్ర సమాచారం కోరే అవకాశం ఉంది. హైడ్రా కమిటీ విధానంలో మార్పులు అవసరమని సూచించనుందా? లేకపోతే కమిటీపై మరింత గణనీయమైన ఆదేశాలు జారీ చేస్తుందా? అన్నది ఆసక్తిగా మారింది.
McDonald’s : మెక్ డోనాల్డ్స్ తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం