Big Explosion : టర్కీలోని పశ్చిమ నగరమైన ఇజ్మీర్‌లోని రెస్టారెంట్‌లో ఆదివారం జరిగిన ట్యాంక్ పేలుడులో ఐదుగురు మరణించారు. మరో 63 మంది గాయపడ్డారు. ఈ ప్రమాద దృశ్యాలు రెస్టారెంట్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు కొన్ని నిబంధనలు పాటించవలిసి ఉంటుంది. ఆ నిబంధనలన్నీ భద్రతను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడుతాయి. రోడ్డుపై మీరు ఎక్కడికైనా బైక్ పై వెళ్తున్నట్లయితే హెల్మెట్ ధరించడం చాలా ముఖ్యం. అంతేకాకుండా స్పీడ్‌ను పరిమితిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. అలాగే బైక్ పై ఇద్దరికి మించి ప్రయాణించకూడదు. ఒకవేళ ఆ నియమాలను ఉల్లంఘిస్తే, చట్టపరమైన చర్యలు తప్పవు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు కనిపిస్తున్నాడు.
త్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లా గుండర్ దేహి బ్లాక్ కు చెందిన ఖుతేరి గ్రామ ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. ఊరిలో ఉండే ట్యాంక్ లోని నీరు తాగి 132 మంది అస్వస్థతకు గురయ్యారు. అయితే గ్రామంలోనే వారికి తాత్కాలిక శిబిరం ఏర్పాటు చేసి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో 112 మంది జ్వరంతో బాధపడుతుండగా.. 5 మందికి వాంతులు విరేచనాలు, 15 మంది జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్లు గుర్తించారు.
MadhyaPradesh: ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరు మద్యమే అనడంతో సందేహమే లేదు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో మద్యం ఏరులై పారుతోంది. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమ మద్యాన్ని తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు.