టీమిండియా బౌలర్ మహమ్మద్ సిరాజ్కు ఐసీసీ (ICC) షాక్ ఇచ్చింది. అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్, భారత ఫాస్ట్ బౌలర్ సిరాజ్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలో సిరాజ్ ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5ను ఉల్లంఘించినట్లు గుర్తించింది. దీంతో.. మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
అడిలైడ్ టెస్టుకు ముందే టీమిండియాకు షాక్ తగిలేలా ఉంది. పింక్ బాల్ మ్యాచ్‌కు భారత జట్టు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ ఆడటం కష్టమే అనిపిస్తుంది. గిల్ బొటనవేలు గాయం నుండి ఇంకా కోలుకోలేదు. ఈ క్రమంలో.. నవంబర్ 30 నుండి కాన్‌బెర్రాలో ప్రారంభమయ్యే ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో జరిగే రెండు రోజుల పింక్ బాల్ వార్మప్ మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మెగా వేలం నుండి టోర్నమెంట్‌లోని 10 జట్లు మొత్తం ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. చాలా మంది ఆటగాళ్లు విడుదలయ్యారు. విడుదలైన వారిలో స్టార్ క్రికెటర్లు కూడా ఉన్నారు.
శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో ఇన్నింగ్స్‌లో డీఆర్‌ఎస్ తీసుకోకుండా విరాట్ కోహ్లీ పెద్ద తప్పు చేశాడు. చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 36 బంతుల్లో 17 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో.. మెహదీ హసన్ మిరాజ్ వేసిన ఫుల్ డెలివరీ తప్పి బంతి ప్యాడ్‌కు తగిలింది. ఆలస్యం చేయకుండా అంపైర్ అప్పీల్‌ను అంగీకరించి ఔట్ ఇచ్చాడు. ఆ సమయంలో.. తోటి బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌తో…
వైసీపీ హయాంలో కేంద్రం నుంచి ఏపీకి డిప్యూటేషన్ మీద వచ్చిన అధికారులకు కేంద్రం ఝలక్ ఇస్తుంది. ఏపీ ప్రభుత్వ ఆమోదం లేకుండా మాతృ శాఖల్లో చేరడానికి వచ్చే అధికారులకు నో ఎంట్రీ బోర్డు పెడుతుంది. కేంద్ర సర్వీసుల నుంచి డెప్యూటేషన్ మీద వచ్చిన అధికారులను రిలీవ్ చేయొద్దని గతంలోనే సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.
టీ20 వరల్డ్ కప్ 2024 సూపర్-8 మ్యాచ్లు ఈరోజు ప్రారంభమయ్యాయి. వెస్టిండీస్-అమెరికా మ్యాచ్ తో షురూ అయ్యాయి. సూపర్-8లోని గ్రూప్ 2లో ఇప్పటివరకు రెండు మ్యాచ్లు జరిగాయి. తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికా-అమెరికా జట్లు తలపడగా.. రెండో మ్యాచ్లో ఇంగ్లండ్, ఆతిథ్య వెస్టిండీస్ తలపడ్డాయి. కాగా.. తొలి మ్యాచ్లో సౌతాఫ్రికా గెలువగా.. రెండో మ్యాచ్లో ఇంగ్లండ్ విజయం సాధించింది. దీంతో.. ప్రస్తుతం రెండు జట్లు చెరో 2 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉన్నాయి.
రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు కొన్ని నిబంధనలు పాటించవలిసి ఉంటుంది. ఆ నిబంధనలన్నీ భద్రతను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడుతాయి. రోడ్డుపై మీరు ఎక్కడికైనా బైక్ పై వెళ్తున్నట్లయితే హెల్మెట్ ధరించడం చాలా ముఖ్యం. అంతేకాకుండా స్పీడ్‌ను పరిమితిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. అలాగే బైక్ పై ఇద్దరికి మించి ప్రయాణించకూడదు. ఒకవేళ ఆ నియమాలను ఉల్లంఘిస్తే, చట్టపరమైన చర్యలు తప్పవు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు కనిపిస్తున్నాడు.
జపాన్‌లోని హక్కైడో ప్రావిన్స్‌లోని హకోడేట్ తీరంలో శుక్రవారం ఉదయం వేల సంఖ్యలో చేపలు కొట్టుకురావడం కనిపించింది. ఇంత పెద్ద సంఖ్యలో చనిపోయిన చేపలను చూసి స్థానిక ప్రజలు ఖంగుతిన్నారు. కాగా.. ఆ చేపలను తినవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా.. చనిపోయిన చేపలను ఇంటికి తీసుకురావద్దని స్థానిక యంత్రాంగం ప్రజలను అభ్యర్థించింది. ఎందుకంటే ఈ చేపలు విషం వల్ల చనిపోయాయని చెబుతున్నారు. కాగా.. చనిపోయిన ఈ చేపల వీడియోకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో…
మధురైలో జరిగిన రైలు ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. ప్రయాణికుల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని రైల్వేని కోరారు.
మహబూబాబాద్ జిల్లా పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్రమంత్రి కేటీఆర్ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. మానుకోటలో రూ.50 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ అసహనానికి గురయ్యారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ప్రారంభించేందుకు వెళ్తున్న కేటీఆర్ తో ఎమ్మెల్యే శంకర్ నాయక్ కరచాలనం చేసేందుకు ప్రయత్నించగా మంత్రి కేటీఆర్ సీరియస్ గా ఎమ్మెల్యే చేయిని తీసి పడేశారు.