* నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు బండి సంజయ్.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని ప్రశ్నించనున్న సిట్ అధికారులు.. సిట్ విచారణలో ఆధారాలు ఇవ్వనున్న బండి సంజయ్..
* నేడు మంత్రి కోమటిరెడ్డితో దిల్ రాజు భేటీ.. సినీ కార్మికుల సమస్యలపై ప్రధానంగా చర్చ..
* నేడు వరంగల్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన.. లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ..
* నేడు అచ్చంపేటకు మాజీమంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్.. బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం కానున్న నేతలు..
* నేడు తెలంగాణలోని 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు..
* నేటి నుంచి విశాఖలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్.. ప్రారంభించనున్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.. ఏపీఎల్ మ్యాచ్ లను వీక్షించేందుకు ఫ్రీ ఎంట్రీ..
* నేటి నుంచి తిరుమలలో ఆర్జిత సేవలు పున: ప్రారంభం.. రేపు శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ వాహన సేవ.. రాత్రి 7గంటలకి గరుడ వాహనంపై భక్తులకు మలయప్పస్వామిగా దర్శనం..
* నేడు తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం.. సాయంత్రం 6 గంటలకు స్వర్ణ రథం.. వర లక్ష్మీ వ్రతం సందర్భంగా భారీ భద్రత ఏర్పాట్లు చేసినా టిటిడి..
* నేడు శ్రీశైలంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా 1600 మంది మహిళలతో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతం.. చంద్రవతి కళ్యాణ మండపంలో మహిళలతో సామూహిక వరలక్ష్మి వ్రతం జరిపించనున్న అర్చకులు.. వరలక్ష్మి వ్రతానికి మహిళలకు పూజ సామాగ్రి ఉచితంగా అందజేయనున్న దేవస్థానం..
* నేటి నుంచి ఇంద్ర కీలాద్రి పై పవిత్రోత్సవాలు ప్రారంభం.. మూడు రోజులు పాటు జరుగనున్న పవిత్రోత్సవాలు.. ఉదయం 9.30 నుంచి వరలక్ష్మి అమ్మవారి అలంకారంలో దర్శనం ఇవ్వనున్న జగన్మాత కనకదుర్గా దేవి..
* నేడు నంద్యాల జిల్లా మహానందిలో సామూహిక వరలక్ష్మీ వ్రతం.. భారీగా హాజరుకానున్న మహిళ భక్తులు..
* నేటి నుంచి మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 354వ ఆరాధనోత్సవాలు ఉత్సవాలు ప్రారంభం.. ఏడు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలు..
* నేడు శ్రావణ శుక్రవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు.. శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి మహాభ్యంగనం సువాసినిలు, శ్రీ లలితా సహస్రనామ చతుష్టోపచార పూజ నిర్వహించిన ఆలయ అర్చకులు.. స్వామివారికి అభిషేకములు అమ్మవారికి కుంకుమ పూజలు ఓడి బియ్యం సమర్పించిన భక్తులు..
* నేడు బీహార్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన.. పుణౌరాధామ్ లో మాతా జానకీ ఆలయానికి శంకుస్థాపన.. జానకి ఆలయానికి శంకుస్థాపన చేయనున్న అమిత్ షా..