కారు కొన్న తర్వాత, వాహనదారులు తరచుగా వివిధ రకాల యాక్సెసరీలను ఇన్‌స్టాల్ చేసుకుంటారు. అలాంటి ముఖ్యమైన యాక్సెసరీలలో డ్యాష్ క్యామ్ ఒకటి. ప్రయాణ సమయంలో డ్యాష్ కెమెరా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కారును రోడ్డుపై సురక్షితంగా ఉంచడంలో సహాయపడటమే కాకుండా డ్రైవర్‌కు రక్షణను అందిస్తుంది. ఇది రోడ్డు ప్రమాదాలు, బీమా మోసాలు, లేదా ఇతర సంఘటనలను నిశ్శబ్ద సాక్షిగా రికార్డ్ చేస్తుంది. వాహనం నడుస్తున్నప్పుడు లేదా పార్క్ చేసినప్పుడు కూడా ఇది వీడియోను రికార్డ్ చేస్తుంది.…
భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగోతోంది. ఆటోమొబైల్ కంపెనీలు అదిరిపోయే ఫీచర్లతో ఈవీలను మార్కెట్ లోకి తీసుకొస్తు్న్నాయి. తాజాగా మోంట్రా ఎలక్ట్రిక్ తన కొత్త ఎలక్ట్రిక్ ట్రక్, మోంట్రా రైనోను సెప్టెంబర్ 28న భారత మార్కెట్ లో విడుదల చేసింది. మోంట్రా ఎలక్ట్రిక్ తన కొత్త ఎలక్ట్రిక్ ట్రక్కు, మోంట్రా రైనో 5538 EV 4×2 TT ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ట్రక్కును ఫిక్స్‌డ్ బ్యాటరీతో రూ. 1.15 కోట్ల ఎక్స్-షోరూమ్…
ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీలు ఈవీలను రూపొందించి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లు రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహన తయారీదారు కైనెటిక్ ఇ-లూనా ప్రైమ్‌ను ప్రారంభించింది. కైనెటిక్ గ్రీన్ మార్కెట్లో ఇ-లూనా ప్రైమ్‌ను విడుదల చేసింది. తయారీదారు ఈ మోపెడ్‌ను విస్తృత శ్రేణి ఫీచర్లతో అందిస్తోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మారుతున్న అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన ఇ-లూనా ప్రైమ్ వినియోగదారులకు…
హోండా కంపెనీ బైకులకు మార్కెట్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. క్వాలిటీ, ఫీచర్లు వాహనదారులను అట్రాక్ట్ చేస్తుంటాయి. తాజాగా హోండా మోటార్ హోండా CB350C ప్రత్యేక ఎడిషన్ భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇంజిన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం.. స్పెషల్ ఎడిషన్ మోటార్ సైకిల్ లో స్పెషల్ ఎడిషన్ స్టిక్కర్లు, వివిధ భాగాలపై కొత్త చారల గ్రాఫిక్స్ ఉన్నాయి. వెనుక గ్రాబ్ రైల్ కూడా క్రోమ్-ఫినిష్ చేయబడింది. సీటు…
దేశంలో సాధారణ వాణిజ్య విభాగంలోని వాహనాలతో పాటు, ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఆటోమొబైల్ కంపెనీలు సరికొత్త ఈవీ వాహనాలను తీసుకొస్తున్నాయి. యూలర్ ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ మినీ ట్రక్కును విడుదల చేసింది. భారత మార్కెట్లో యూలర్ టర్బో EV 1000 ను విడుదల చేసింది. ఈ మినీ ఎలక్ట్రిక్ ట్రక్కును కళ్లు చెదిరే ఫీచర్లతో విడుదల చేశారు. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, యూలర్ కొత్త ట్రక్కు అనేక వినూత్న లక్షణాలను కలిగి ఉంది.…
నెక్సా ప్రీమియం డీలర్‌షిప్ నెట్‌వర్క్ 10 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, మారుతి సుజుకి తన నెక్సా ఫ్లాగ్‌షిప్ SUV – గ్రాండ్ విటారా SUV ప్రత్యేక ఆల్-బ్లాక్ ఎడిషన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. మారుతి గ్రాండ్ విటారా ఫాంటమ్ బ్లాక్ ఎడిషన్ అని పిలువబడే ఈ మోడల్ ప్రత్యేకమైన మాట్టే బ్లాక్ పెయింట్ స్కీమ్‌లో వస్తుంది. ఇది ఆల్ఫా ప్లస్ వేరియంట్‌లో (గ్రాండ్ విటారా కొత్త ఎడిషన్) లభ్యమవుతుంది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఫాంటమ్ బ్లాక్…
ఫోల్డబుల్ ఫోన్లను కొనేందుకు స్మార్ట్ ఫోన్ లవర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తు్న్నారు. బడ్జెట్ ధరల్లోనే లభిస్తుండడంతో డిమాండ్ పెరిగింది. ఇప్పటికే మొబైల్ తయారీ సంస్థలు అదిరిపోయే ఫీచర్లతో ఫోల్డబుల్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. మరి మీరు కూడా కొత్త ఫోల్డబుల్ ఫోన్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ లో అదిరిపోయే డీల్ అందుబాటులో ఉంది. TECNO Phantom V Flip 5G మొబైల్ పై 64శాతం డిస్కౌంట్ లభిస్తోంది.…
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ షావోమీ మార్కెట్ లో తన సత్తా చాటుతోంది. ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ ఫీచర్లతో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ను రూపొందిస్తూ మార్కెట్ లోకి రిలీజ్ చేస్తుంది. దీంతో షావోమీ ఉత్పత్తులకు ఫుల్ డిమాండ్ ఏర్పడుతోంది. ఇప్పుడు మరో కొత్త ప్యాడ్ ను లాంఛ్ చేసింది. మతిపోగొట్టే ఫీచర్లతో షావోమీ ప్యాడ్ 7 ను నేడు దేశీయ మార్కెట్ లోకి విడుదల చేసింది.
వివో (Vivo) 'Y' సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. చైనాలో లాంచ్ చేసిన ఈ ఫోన్‌కు కంపెనీ 'Vivo Y300' అని పేరు పెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్‌ను చైనా కంటే ముందే భారత్‌లో ప్రవేశపెట్టిందని చెబుతున్నారు. ఈ ఆండ్రాయిడ్ ఫోన్ 120Hz ఫ్లాట్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే.. డైమండ్ షీల్డ్ గ్లాస్‌తో వస్తుంది.
ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఎలక్ట్రిక్ కార్లే నడుస్తున్నాయి. అన్ని రకాల కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లనే తయారు చేస్తున్నాయి. తక్కువ ధర నుంచి మొదలు పెడితే భారీ ధర వరకు ఎలక్ట్రిక్ కార్ల ఉన్నాయి. అందులో అతి చౌకైన ఎలక్ట్రిక్ కారు ఒకటి భారత్‌లో రిలీజ్ కానుంది. PMV EaS-E కంపెనీ తయారు చేసిన ఈ కారు ధర రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఉండనుంది.