విశాఖపట్నంలో భారీ పేలుడు సంభవించింది.. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఏరియాలో ఈ పేలుడు ఘటన చోటు చేసుకుంది.. విశాఖపట్నం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాలయ బార్ దగ్గర గ్యాస్ సిలిండర్ పేలడంతో.. ముగ్గురు మృతిచెందారు.. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయినట్టుగా తెలుస్తోంది.
హర్యానాలోని బహదూర్‌గఢ్‌లో శనివారం సాయంత్రం 6:30 గంటలకు ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో నలుగురు కుటుంబ సభ్యులు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనను పరిశీలించిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
LPG Price Hike : నేటి నుంచి కొత్త నెల డిసెంబర్ ప్రారంభం కావడంతో గ్యాస్ సిలిండర్ల ధరలు విపరీతంగా మారాయి. ప్రభుత్వ చమురు కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీన ఎల్‌పిజి సిలిండర్ల ధరలను సమీక్షిస్తాయి. దీని కింద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గ్యాస్ ధరలను పెంచింది. 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్‌కు ఈ పెంపు జరిగింది. సాధారణ ఎల్‌పిజి అంటే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ అంటే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ రేటులో ఎలాంటి…
ఈ రోజుల్లో మనలో చాలా మంది వంట కోసం ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌ని ఉపయోగిస్తున్నారు. బొగ్గు, కలప వంటి సాంప్రదాయ వనరులతో పోలిస్తే.. ఎల్‌పీజీ సిలిండర్ వాడి వంట చేయడం చాలా సులభం. ఇది పోర్టబుల్ కాబట్టి.. మీరు దీన్ని ఎక్కడైనా ఉపయోగించవచ్చు. ఇతర ఇంధనాలతో పోలిస్తే ఇవి చాలా పొదుపుగా ఉంటాయి.
Bulandshahr Cylinder Blast: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆశాపురి కాలనీలో సిలిండర్ పేలడంతో ఇంటి పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో కుటుంబానికి చెందిన ఆరుగురు శిథిలాల కింద పడి మృతి చెందారు. ఇంకా చాలా మంది శిథిలాల కింద చనిపోయి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. పోలీసు పరిపాలన ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు. శిథిలాల కింద మహిళలు, చిన్నారులు…
Cylinder on the track: ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్ రైల్వే ట్రాక్‌పై మరోసారి అనుమానాస్పద వస్తువు కనిపించింది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ లోక్‌పైలట్ ట్రాకుపై ఉన్న వస్తువుని గుర్తించి సకాలంలో బ్రేకులు వేశాడని పోలీసులు తెలిపారు. ట్రాక్‌పై ఎర్రని సిలిండర్‌ని గమనించి, దానికి దూరంగా రైలుని ఆపినట్లు వెల్లడించారు. ఇటీవల కాలంలో రైల్వే ట్రాకులపై గ్యాస్ సిలిండర్లు, కాంక్రీట్ దిమ్మలు గుర్తించిన అనేక కేసుల మధ్య తాజాగా ఘటన వెలుగులోకి వచ్చింది.
Gas Cylinder on railway track: ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లో మరోసారి రైలు దుర్ఘటనకు కుట్ర పన్నిన ఘటన వెలుగు చూసింది. కాన్పూర్ దేహత్ జిల్లాలోని రైల్వే ట్రాక్‌పై చిన్న గ్యాస్ సిలిండర్ కనుగొనబడింది. ఒకవేళ ఆ గ్యాస్ సిలిండర్ ను ఢీకొంటే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇందుకోసం రైల్వే ట్రాక్‌పై ఎల్‌పీజీ సిలిండర్‌ను ఉంచారు. దీంతో పాటు రైల్వే లైన్ సమీపంలో పెట్రోల్, గన్ పౌడర్ లను కూడా స్వాధీనం చేసుకున్నారు. సమాచారం…
పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో విపరీతమైన ఎండలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వేడిమి కారణంగా గ్యాస్ పేలుడు సంభవించి ఐదుగురు మరణించారు. దాదాపు 50 మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. ఈ మేరకు శుక్రవారం పోలీసులు సమాచారం అందించారు. సింధ్‌లోని హైదరాబాద్ ప్రాంతంలోని ఓ దుకాణంలో గ్యాస్ సిలిండర్ వేడి కారణంగా పేలిపోవడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రోజు మరణించారని.. మంటల్లో గాయపడిన మరికొందరు…
Fire Accident : బీహార్‌లోని వైశాలిలోని బిదుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవనగర్ గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అకస్మాత్తుగా పేలడంతో ఇంట్లో ఉన్న సభ్యులు తీవ్రంగా కాలిపోయారు.