పవిత్ర గంగా పుష్కరాలు ప్రారంభమయ్యాయి. భక్తులు కాశీనాథుడి దర్శనం కోసం బారులు తీరారు. వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం, అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించాలనుకునే భక్తుల కోసం IRCTC టూరిజం ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది.’గంగా రామాయణ’ యాత్ర టూర్ ప్యాకేజీ హైదరాబాద్ నుండి నడుస్తోంది. ఇది పర్యాటకులను విమానంలో తీసుకెళ్లి వారణాసి, అయోధ్య, నైమిశారణ్య, ప్రయాగ్‌రాజ్, సారనాథ్‌లోని దేవాలయాలను చూపిస్తారు. ఇది 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ టూర్ ప్యాకేజీ మే 4న అందుబాటులోకి వస్తుంది.
Also Read:Flight to Alaska: ఛీఛీ.. విమానంలో పాడు పని!
IRCTC గంగా రామాయణ యాత్ర మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. వారణాసి చేరుకున్న అనంతరం హోటల్‌లో చెక్-ఇన్ చేసిన తర్వాత కాశీ విశ్వనాథ దేవాలయం, గంగా ఘాట్ సందర్శించండి. వారణాసిలో రాత్రి బస చేస్తారు. రెండవ రోజు ఉదయం సారనాథ్ బయలుదేరవలసి ఉంటుంది. మధ్యాహ్నం వారణాసికి తిరుగు ప్రయాణం. సాయంత్రం ఖాళీ సమయం ఉంటుంది. ఘాట్‌లను సందర్శించవచ్చు లేదా షాపింగ్ చేయవచ్చు. వారణాసిలో రాత్రి బస చేస్తారు.
Also Read:Rahul Gandhi: నిజం మాట్లాడినందుకు మూల్యం.. బంగ్లా ఖాళీ చేసిన రాహుల్
మూడవ రోజు వారణాసిలో చెక్ అవుట్ చేసి, ప్రయాగ్‌రాజ్‌కి బయలుదేరుతారు. అలోపి దేవి ఆలయం, త్రివేణి సంగమం చూడవచ్చు. సాయంత్రం అయోధ్యకు వెళ్తారు. రాత్రికి అయోధ్యలో బస చేస్తారు. నాల్గవ రోజు అయోధ్య ఆలయ సందర్శన ఉంటుంది. మధ్యాహ్నం లక్నోకు వెళ్లి రాత్రికి బస చేస్తారు. ఇక, ఐదవ రోజు నైమిశారణ్యం పూర్తి రోజు దర్శనం ఉంటుంది. సాయంత్రం లక్నోకు తిరిగి వెళ్లి రాత్రికి అక్కడే బస చేస్తారు. ఆరవ రోజు బారా ఇమాంబర, అంబేద్కర్ మెమోరియల్ పార్క్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ ప్రయాణం ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటలకు విమానం లక్నో చేరుకుని రాత్రి 8 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది. IRCTC గంగా రామాయణ్ యాత్ర టూర్ ప్యాకేజీ ధరను పరిశీలిస్తే.. మీరు ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.28,200, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.29,900, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.36,850 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో విమాన టిక్కెట్లు, హోటల్, అల్పాహారం, రాత్రి భోజనం, ఏసీ బస్సులో సందర్శనా, ప్రయాణ బీమా వంటివి ఉంటాయి.