ప్రయాణ సమయాల్లో ఈ మధ్య విమానాల్లో జరుగుతున్న సంఘనలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అలాస్కాకు వెళ్లే విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుతు విమాన సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. 61 ఏళ్ల ప్రయాణీకుడు తన ప్రయాణ సమయంలో ఎక్కువగా మద్యం సేవించి క్యాబిన్ సిబ్బందిలో ఒకరిపై బలవంతం చేశాడు. సదరు ప్రయాణికుడు డేవిడ్ అలాన్ బర్క్‌గా గుర్తించారు.
Also Read:Afghanistan: ఆఫ్గాన్‌లో ఈద్ వేడుకలు.. మహిళలపై తాలిబన్ల ఆంక్షలు
ఏప్రిల్ 10న మిన్నెసోటా నుండి బయలుదేరిన విమానంలో డేవిడ్ అలాన్ బర్క్ మద్యం సేవించాడు. ఫస్ట్-క్లాస్ ప్రయాణీకుడిగా మద్యం సేవించడానికి అనుమతి ఉంది. అయితే, విమానంలో నిబంధనల కారణంగా అతనికి డ్రింక్ ఇవ్వలేదు. దాంతో ఆయన ఆవేశంగా ఊగిపోయాడు. విమానం టేకాఫ్ అయిన తర్వాత, బుర్క్‌కు అదే ఫ్లైట్ అటెండెంట్ సేవలు అందించాడు. ఈ సందర్భంగా బుర్క్ అటెండర్‌ని అతని వైపుకు లాగి, అతని మెడపై ముద్దు పెట్టుకున్నాడు. ఈ సంఘటన తర్వాత, డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం క్యాబిన్‌లో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో బర్క్ కెప్టెన్ కోసం ఆహారం ఉన్న ట్రేలో ఒక డిష్‌ను పాడు చేశాడు.
Also Read:Revanth Reddy: రూపాయి ముట్టుకున్నా సర్వనాశనమైపోతాం.. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న రేవంత్
విమానం ల్యాండింగ్ తర్వాత పైలట్ సంఘటన గురించి అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే, విచారణ సమయంలో బుర్క్ తాను డిష్ పగలలేదని, ఫ్లైట్ అటెండెంట్‌ను ముద్దుపెట్టుకోలేదని చెప్పాడు. తాను మత్తులో ఉన్నానని FBI అధికారులకు చెప్పాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బుర్క్‌పై దాడి, నేరపూరిత దుష్ప్రవర్తన ఆరోపణలపై ఏప్రిల్ 27 న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు.