ఢిల్లీలోని లుటియన్స్‌లో ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఖాళీ చేశారు. ఆయన తన తల్లి సోనియా గాంధీతో కలిసి జన్‌పథ్‌లోని నివాసంలో కొంతకాలం ఉంటారు. రాహుల్ గాంధీ ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత తన అధికారిక బంగ్లాను ఖాళీ చేయమని అధికారులు కోరారు. 12 తుగ్లక్ లేన్‌లోని బంగ్లాను ఏప్రిల్ 22లోగా ఖాళీ చేయాలని రాహుల్ గాంధీకి లోక్‌సభ హౌసింగ్ కమిటీ నోటీసు జారీ చేసింది. గడువు నేటితో పూర్తి అయింది. దీంతో రాహుల్ ఈ రోజు బంగ్లాను ఖాళీ చేశారు. 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అమేథీలో గెలుపొందిన తర్వాత తనకు కేటాయించిన బంగ్లాను రాహుల్ వినియోగిస్తున్నారు. తన అధికారిక నివాసంగా ఉపయోగిస్తున్నారు. బీజేపీ ఎంపీ సీఆర్ పాటిల్ నేతృత్వంలోని లోక్‌సభ హౌసింగ్ కమిటీ తన 12 తుగ్లక్ లేన్ బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా కోరుతూ లేఖ పంపింది. ఇంటిని ఖాళీ చేసిన అనంతరం తాళాలను అధికారులకు అందజేశారు.
Also Read:Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన.. మూడు రోజులు వానలే..
తన ఇంటిని ఖాళీ చేసిన అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. “నిజం మాట్లాడినందుకు నేను మూల్యం చెల్లిస్తున్నాను అని వ్యాఖ్యానించారు. సోనియాగాంధీ నివాసమైన 10 జనపథ్‌లో కొంతకాలం బస చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మాట్లాడుతూ “నా సోదరుడు ఏది చెప్పినా అది నిజం. అతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాడు మరియు దాని ఫలితమే ఇది” అని అన్నారు. రాహుల్ చాలా ధైర్యవంతుడని, తాను అతనితో ఉన్నానని చెప్పారు. ఏప్రిల్ 11న, రాహుల్ గాంధీ తన అనర్హతతో తాను భయపడబోనని, ఆ ఇంట్లో నివసించడానికి తనకు ఆసక్తి లేదని అన్నారు. కాంగ్రెస్ నాయకులు కేంద్రంపై రాజకీయ పగబట్టారని ఆరోపించారు.దొంగలందరికీ మోడీ ఇంటిపేరు ఎందుకు ఉంది అనే వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ దోషిగా నిర్ధారించారు. కాంగ్రెస్ ఎంపీ ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత, ఎన్నికల కమిషన్‌తో సహా సంబంధిత అధికారులకు కమ్యూనికేషన్ పంపబడింది. రాహుల్ గాంధీ, ఆయన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఉదయం నుంచి రెండుసార్లు బంగ్లాను సందర్శించారు.