టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత అన్ని అధునాతనంగా మారిపోతున్నాయి. పాశ్చాత్య దేశాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా మనదేశంలో మౌళిక వసతుల రూపకల్పన జరుగుతున్నది. ఇక రైల్వే స్టేషన్లను, రైల్వే స్టేషన్లలో వసతులను అధునాతనంగా మార్పులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ముంబైలోని సెంట్రల్ రైల్వేస్టేషన్లో ప్రయాణికుల కోసం అధునతాన రీతిలో జపాన్‌లో ఉండే విధంగా పాడ్ రూమ్స్‌ను ఏర్పాటు చేశారు.
Read: ఇంటర్య్వూలకు వెళ్లాలంటే ఇకపై రెజ్యూమ్ అవసరం లేదు.. ఇలా వీడియో చేస్తే చాలట…
ఈ పాడ్ రూమ్స్‌లో సేదతీరే ప్రయాణికులకు హాలివుడ్ సినిమాల్లో ఉండే విధంగా ఇంటీరియర్ ను ఏర్పాటు చేశారు. క్యాప్యూల్స్ తరహాలో ఉండే ఈ రూమ్‌లను పేరుకు తగిన విధంగానే అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. 12 గంటలకు సేద తీరేందుకు రూ.999, 24 గంటలకు రూ.1999 ఛార్జ్ చేస్తున్నారు. ముంబై రేల్వే స్టేషన్లో మొత్తం 48 పాడ్ రూమ్స్ అందుబాటులో ఉన్నట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఈ పాడ్ రూమ్స్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
मुंबई सेंट्रल स्टेशन येथे "पीओडी " रिटायरिंग रूम्स.
— Raosaheb Patil Danve (@raosahebdanve) November 17, 2021
पॉड कन्सेप्ट वर आधारीत ही सुविधा, प्रवाशांना अत्यंत कमी दरात व मूलभूत सुविधांसह एक उत्तम पर्याय म्हणून उपलब्ध आहे. pic.twitter.com/KsH93qAd0s