ఇంట‌ర్య్వూల‌కు వెళ్లాలంటే ఇక‌పై రెజ్యూమ్ అవ‌స‌రం లేదు.. ఇలా వీడియో చేస్తే చాల‌ట‌…

ఏదైనా ఇంట‌ర్య్వూకు హాజ‌రుకావాలంటే చేతిలో రెజ్యూమ్ తీసుకొని వెళ్లాల్సిందే.  ఎంత చిన్న లేదా పెద్ద కంపెనీ అయినా ఈ ప్రాసెస్ త‌ప్ప‌నిస‌రి.  అయితే, ఇక‌పై అలాంటి ఇబ్బందులు ఉండబోవ‌ని అంటున్నారు స‌భీర్ భాటియా.  హాట్ మెయిల్ గురించి తెలిసిన వారికి స‌భీర్ భాటియా గురించి తెలుసు.  హాట్ మెయిల్‌ను సృష్టించిన త‌రువాత ఆ మెయిల్ వ్య‌వ‌స్థ‌ను మైక్రోసాఫ్ట్ కంపెనీ కొనుగోలు చేసింది.  ఇప్పుడు హాట్ మెయిల్‌లో ఎన్నో మార్పులు చేసింది మైక్రోసాఫ్ట్‌.  

Read: వైర‌ల్‌: భూమిపై ఉన్న చివ‌రి వ్య‌క్తి అత‌డేన‌ట‌… 2027 నుంచి…

కాగా, ఇప్పుడు స‌భీర్ భాటియా మ‌రో సంచ‌ల‌నానికి సిద్ధ‌మ‌య్యారు.  షోరీల్ పేరుతో ఓ యాప్ ను సిద్ధం చేస్తున్నారు.  టిక్ టాక్ త‌ర‌హాలోనే ఈ యాప్ ఉంటుంది.  అయితే, ఇది ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కు చెందిన యాప్ కాదు.  ఉద్యోగాల‌కు సంబంధించిన యాప్‌.  ఈ యాప్‌లో ఉద్యోగాల‌కు ధ‌ర‌ఖాస్తు చేసుకునే వారి కోసం కొన్ని ప్ర‌శ్న‌లు ఉంటాయి.  వాటికి వీడియో రూపంలో స‌మాధానాలు ఇవ్వాలి.  టిక్‌టాక్ త‌ర‌హాలోనే ఫ్లిప్ ద్వారా యూజ‌ర్ల వీడియోలు చూసుకోవ‌చ్చు.  అదే విధంగా వివిధ కంపెనీల‌కు ఆ వీడియోల‌ను ఎటాచ్ చేసుకోవ‌చ్చు.  ప్ర‌స్తుతం బీటా వెర్ష‌న్‌లో టెస్టింగ్ జ‌రుగుతున్న ఈ షోరీల్ ను త్వ‌ర‌లోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.  షోరీల్ అందుబాటులోకి వ‌స్తే రెజ్యూమ్ వ్య‌వ‌స్థ పూర్తిగా మారిపోయే అవ‌కాశం ఉంటుంది.  

Related Articles

Latest Articles