భారీగా ధ్వంస‌మైన శ్రీవారి మెట్టుమార్గం…

తిరుప‌తిలో నిన్న కొద్దిగా శాంతించిన వ‌ర‌ణుడు ఈరోజు తిరిగి ఉగ్ర‌రూపం చూపిస్తున్నాడు.  ఈరోజు ఉద‌యం 5 గంట‌ల నుంచి తిరుమ‌ల‌, తిరుప‌తిలో భారీగా వ‌ర్షం కురుస్తోంది.  ఈ వ‌ర్షాల ధాటికి మ‌ళ్లి చెరువులు, న‌దులు పొంగి పొర్లుతున్నాయి.  ఇప్ప‌టికే తిరుప‌తి న‌గ‌రంలో ఎటు చూసినా నీరు త‌ప్పించి మ‌రేమి క‌నిపించ‌డంలేదు.  

Read: ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో భారీగా బంగారం ప‌ట్టివేత‌…

అటు తిరుమ‌ల‌కు వెళ్లే మెట్ల మార్గం, రోడ్డు మార్గాలు దెబ్బ‌తిన్నాయి.  శ్రీవారి మెట్టు మార్గం భారీగా దెబ్బ‌తిన్న‌ది.  1200 మెట్టు వ‌ద్ద బ్రిడ్జి నీటి ప్ర‌వాహంలో కొట్టుకుపోయింది.  ఇప్ప‌టీకీ ఈ మార్గంలో వ‌ర‌ద ప్రవాహం కొన‌సాగుతూనే ఉన్న‌ది.  వ‌ర్షాలు భారీగా కురుస్తుండ‌టంతో ఘాట్ రోడ్డులో ద్విచక్ర‌వాహ‌నాల‌ను అనుమ‌తించ‌డంలేదు టీటీడీ.  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డే అవ‌కాశం ఉండ‌టంతో ద్విచ‌క్ర‌వాహ‌నాల‌కు అనుమ‌తుల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.  ద‌ర్శ‌నం టికెట్లు ఉన్న భ‌క్తుల‌ను మాత్ర‌మే తిరుమ‌ల‌కు అనుమ‌తిస్తున్నారు.  

Related Articles

Latest Articles