వేసవి తాపానికి.. ఎండల తీవ్రతను తట్టుకోలేక.. నదులు, కుంటలు, బావుల్లో ఈతలు కొడుతూ సేదతీరుతున్నారు.. అయితే, సమయంలో అనుకోని ప్రమాదాలతో ఈ ఏడాది ఇప్పటికే ఏపీలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.. తాజాగా, చిత్తూరు జిల్లా వీకోటలో విషాదం నెలకొంది.. చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు.. దీంతో, శోకసంద్రంగా మారింది మోట్లపల్లి గ్రామం..
వాటర్ క్యాన్ ఓ యువకుడి ప్రాణం తీసింది..! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. వాటర్ క్యాన్ మూలంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.. బావిలో ఈత కొట్టేందుకు యువకుడు వాటర్ క్యాన్ డబ్బాను కట్టుకొని ఈతకు వెళ్లగా.. ఆ క్యాన్ కు హోల్ పడి నీళ్లు లోనికి వెళ్లి ఆ యువకుడు నీట మునిగి మరణించిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది..
వైఎస్‌ఆర్ కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.. సరదా కోసం ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థులు గల్లంతు కావడంతో మల్లెపల్లి గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి . బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లిలో వేసవి సెలవులు కావడంతో ఐదుగురు విద్యార్థులు ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు సమీపంలోని బంధువుల ఇళ్ల దగ్గరకు వెళ్లి వెతికినా ఆచూకీ తెలియరాలేదు.
అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈత సరదా ముగ్గురు చిన్నారుల ప్రాణాలను గాల్లో కలిపేసింది. శ్రీరామనవమి వేడుకల్లో గ్రామమంతా ఆనందోత్సవాల్లో ఉన్న సమయంలో అక్కడ చిన్నారుల మృతి వార్త విషాదాన్ని నింపింది. చిట్వేలి మండలం ఎం రాచపల్లిలో నరసరాజు కుమారుడు దేవాన్, శేఖర్ రాజు కుమారుడు విజయ్, వెంకటేష్ కుమారుడు యశ్వంత్ అప్పటివరకు సీతారాముల ఊరేగింపులో పాల్గొని.. ఈత కోసం సమీపంలోని చెరువులోకి వెళ్లారు. మట్టి కోసం తవ్విన గుంటల్లో ఈత కోసం…
ఎన్నికల కోడ్ సాకుతో రైతు భరోసా పథకాన్ని ఆపేందుకు కుట్ర ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని నిలిపివేయాలని చూస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. రైతు భరోసా పథకం ఇప్పటికే అమలులో ఉన్న పథకమే కాబట్టి ఎన్నికల సంఘం నుంచి ఎటువంటి సమస్య ఉండదని ఆయన స్పష్టం చేశారు. పైగా రానున్న ఎన్నికలు పట్టభద్రులు, ఉపాధ్యాయులకు సంబంధించినవే కాబట్టి వాటిపై ప్రభావం పడే…
పల్నాడు జిల్లా సత్తెనపల్లి విషాదం నెలకొంది. అమరావతి మేజర్ కెనాల్‌లో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. వృత్తిని రాఘవేంద్ర బాలకుటిర్‌కు చెందిన మొత్తం ఐదుగురు విద్యార్థులు ఈతకు వెళ్లారు. అయితే.. కెనాల్‌లో దిగిన వీరు కొట్టుకుపోతుండటంతో స్థానికులు చూసి ముగ్గురిని కాపాడారు. మరో ఇద్దరు కెనాల్‌లో కొట్టుకుపోయారు.
Daily Exercise 5 Minutes: నేటి ఆధునిక కాలంలో, ఆరోగ్య సంబంధిత సమస్యలు గణనీయంగా పెరిగాయి. ఈ రోజుల్లో రక్తపోటు అనేది అతి పెద్ద ఆరోగ్య సమస్య. దీంతో ఒక్క భారతదేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. క్రమరహిత ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా ఈ సమస్య అన్ని వయసులవారిలో నిరంతరం పెరుగుతోంది. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, మసాలాలు ఇంకా చక్కెర అధికంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల…
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం మాదాలవారి గూడెంలో విషాదం చోటు చేసుకుంది. లింగయాస్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులు పక్కనే ఉన్న చెరువులోకి ఈతకు వెళ్లి గల్లంతు అయ్యారు. మొత్తం ఏడుగురు బీటెక్ ఫైనలియర్ విద్యార్థులు చెరువులోకి సరదాగా స్నానానికి వెళ్లారు. సెల్ఫీల మోజులో పడి ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో పాలడుగు దుర్గారావు, జే. వెంకటేష్ గా గుర్తించారు. మరో ఐదుగురు విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు.
ప్రకాశం జిల్లా దర్శి మండలం కొత్తపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలో సాగర్ కాలువలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. గజ ఈతగాళ్ల సాయంతో గల్లంతైన వారిలో పోతిరెడ్డి లోకేష్(19) విద్యార్థి మృతదేహం లభ్యం కాగా.. మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో పాల్గొనే భారత జట్టులో 117 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఈ ఒలింపిక్ జట్టులో అతి పిన్న వయస్కురాలైన ధినిధి దేశింగు ఒకటి. స్విమ్మర్ ధినిధి కేవలం 14 సంవత్సరాల వయస్సులో అతిపెద్ద క్రీడల వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. యూనివర్సాలిటీ కోటా సహాయంతో ధీనిధికి పారిస్ వెళ్ళే అవకాశం వచ్చింది. ఒకప్పుడు నీళ్లలో కాలు పెట్టాలంటే కూడా భయపడే ధినిధి పారిస్ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ధీనిధి…