వైసీపీ ఎంపీ రఘురామరాజు కాలి గాయాలపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు జీజీహెచ్ సూపరెండేంట్, జనరల్ మెడికల్ డిపార్ట్మెంట్ శాఖ HOD, గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరెండేంట్ సూచించిన గవర్నమెంట్ డాక్టర్.. ఈ ముగ్గురితో కూడిన మెడికల్ కమిటీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ వైద్య పరీక్షలను వీడియో రికార్డింగ్ చేయాలని… రికార్డు చేసిన వీడియోను పెన్ డ్రైవ్ లో సీల్డ్ కవర్లో హైకోర్టుకు వ్యాక్సినేషన్ ఆఫీసర్ M.నాగేశ్వరరావుకు అందజేయాలని గుంటూరు జిల్లా ప్రిన్సిపల్ జడ్జికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ రఘురామకృష్ణంరాజు హాస్పిటల్ లో చికిత్స పొందే సమయంలో కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనుమతితో పాటు, అదే విధంగా CRPF గార్డు ఉండే విదంగా అనుమతి ఇవ్వాలని పిటీషినర్ న్యాయవాది కోరిన అభ్యర్థులను హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసు విచారణను ఇవాళ్టి మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది స్పెషల్ డివిజన్ బెంచ్.