శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రధాన దారిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్ పోర్ట్ కు వెళుతున్న ఉబర్ క్యాబ్ డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదు నెల గర్భవతితో పాటు అమె తల్లికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగి గంట గడిచిన అంబులెన్స్ కానీ పోలీసులు కానీ రాలేదని బాధితులు అవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన గంట తరువాత సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ప్రైవేట్ అంబులెన్స్ లో క్షతగాత్రులను శంషాబాద్ ప్రైవేట్ హాస్పిటల్…
Accident : అన్నమయ్య జిల్లాలోని రెడ్డిపల్లె వద్ద ఓ లారీ బోల్తా పడిన ఘటనలో ఏడుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో లారీలో మొత్తం 15 మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. వివరాల్లోకి వెళితే… కడప జిల్లా రైల్వేకోడూరు పరిధికి చెందిన కూలీలు, మామిడికాయలు కోసేందుకు రెడ్డిపల్లె ప్రాంతానికి వచ్చారు. పనులు పూర్తయ్యాక కోసిన కాయలను లారీలో లోడ్ చేసి తిరిగి బయలుదేరారు. అయితే చెరువు కట్ట…
BGT Series: మెల్‌బోర్న్ వేదికగా జరగనున్న నాలుగో టెస్టుకు ముందు టీమిండియా కష్టాల్లో పడింది. కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ గాయాల కారణంగా టీమిండియా జట్టు ప్రణాళికలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. శనివారం కేఎల్ రాహుల్ చేతికి గాయం కాగా, ఆదివారం రోహిత్ శర్మ మోకాలికి గాయమైంది. ఈ ఇద్దరి గాయాల తీవ్రత ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ, వారు టెస్టుకు దూరమైతే జట్టుకు పెద్ద దెబ్బ అవుతుంది. ఇక 5 టెస్టుల సిరీస్ ప్రస్తుతం…
ప్రముఖ నటుడు మంచు మనోజ్ హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ఆస్పత్రిలో చేరారు. జల్‌పల్లిలో మనోజ్ ఇంట్లో ఉండగా దుండగులు దాడి చేసినట్లు సమాచారం. ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం భార్యతో కలిసి మంచు మనోజ్ వచ్చినట్లు తెలిసింది. ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు మనోజ్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో దివ్వెల మాధురి కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆమె రోడ్డు ప్రమాదానికి గురైంది. కారులో వెళ్తున్న మాధురి.. ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో మాధురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడి స్థానికులు ఆమెను పలాస ఆస్పత్రికి తరలించారు.
అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. కిరాణా షాపులో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా.. మరో 10 మంది గాయపడ్డారు. అర్కాన్సాస్‌లోని ఫోర్డైస్‌లో శుక్రవారం జరిగింది.
2023 వన్డే ప్రపంచ కప్‌లో రేపు (ఆదివారం) భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా టాప్ ప్లేస్ లోకి వెళ్లిపోతుంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్, న్యూజిలాండ్‌లు ఇప్పటి వరకు ఏ మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. అయితే ఈ కీలకమైన మ్యాచ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేయడం భారత కెప్టెన్ రోహిత్ శర్మకు చాలా కష్టంగా మారింది. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు ఓ బ్యాడ్ న్యూస్.
తన పదేళ్ల పాపతో కలిసి మహిళ విమానంలో ప్రయాణిస్తుండగా.. పాపకు హాట్ చాక్లెట్ కావాలని తల్లి కోరింది. విమాన సిబ్బంది పాప కోసం హాట్ చాక్లెట్ తీసుకొచ్చారు.. ఈ క్రమంలో వేడినీరు పాప శరీరంపై పడ్డాయి.
ఓ మైనర్ బాలిక రేప్ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాధితురాలి రహస్య భాగాలపై గాయాలు లేనంత మాత్రాన ఆమెపై లైంగిక దాడి జరగలేదని భావించలేమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. అత్యాచారం కేసులో పిటిషనర్‌కు కింది కోర్టు విధించిన 12 ఏళ్ల జైలుశిక్షను సమర్థించింది.