ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు… మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా ఆగ్రహ సభలో ప్రసంగించిన ఆయన.. కమ్యూనిస్టులు నీచులని, యూనియన్లతో వ్యవస్థల్ని నాశనం చేశారని మండిపడ్డారు. ఇక, కమ్యూనిస్టులు మొరిగే కుక్కలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. అయితే, అదే స్థాయిలో కమ్యూనిస్టులు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.. సోము వీర్రాజును పిచ్చి కుక్క కరిచిందని వ్యాఖ్యానించారు పి. మధు.. బీజేపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు.. అసలు ప్రజలు ఉపయోగపడే పని ఏమైనా చేశారా? అని నిలదీశారు.
ఇక, రైతుల కోసం బీజేపీ ఏమైనా చేసిందా..? అని ప్రశ్నించారు పి. మధు.. బీజేపీకి మతోన్మాదమే తప్ప.. దేశభక్తి లేనేలేదన్న ఆయన.. స్వాతంత్ర్యానికి ముందు జస్టిస్ పార్టీలో ఉండి బ్రిటీషర్లకు మద్దతు పలికింది ఈ బీజేపీనే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. కానీ, మేం అలా కాదు.. మేమే నిజమైన దేశ భక్తులం అని స్పష్టం చేశారు పి. మధు. మరోవైపు సీపీఐ నేత రామకృష్ణ కూడా సోము వీర్రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. రాష్ట్ర ప్రజలు మద్య నిషేధం కోరుతుంటే.. బీజేపీ మాత్రం మద్యం ఏరులుగా పారిస్తానంటోంది అని.. కోటి మంది మందుబాబులు ఉన్నారని.. వారంతా బీజేపీకి ఓట్లు వేయాలని చెప్పడంతో.. సోము వీర్రాజుకు పిచ్చి పరాకాష్టకు చేరిందని.. ఆయన సోము వీర్రాజు కాదు.. సారాయి వీర్రాజు అంటూ మండిపడ్డారు రామకృష్ణ.