తెలంగాణలో జరిగిన హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఫలితాలపై ప్రధాని, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంతృప్తిని వ్యక్తం చేస్తూ , రాష్ట్రపార్టీ నేతలను అభినందించారు. తెలంగాణలో, దక్షిణభారత దేశంలో బీజేపి బలపడుతుందన్న విశ్వాసాన్ని ప్రధాని, పార్టీ జాతీయ అధ్యక్షుడు జే.పి.నడ్డా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో బద్వేల్ ఉపఎన్నికలలో ఓట్లశాతం పెరుగుదలపై సంతృప్తిని వ్యక్తం చేశారు. “దళితబంధు” పథకాన్ని రాష్ట్రమంతా అమలు చేసేలా తెలంగాణ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువస్తామన్నారు బీజేపీ నేతలు. కేంద్ర…
తెలంగాణకు ఉప ఎన్నిక ఫీవర్ పట్టుకుంది. ఒక నియోజకవర్గం కోసం యావత్ రాష్ట్ర పాలనా యంత్రాంగం హుజూరాబాద్‌ని చుట్టేస్తోంది. నేతల మధ్య మాటలు కోటలు దాటుతున్నాయి. ప్రధాన పోటీ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్యే నెలకొని వుంది. కానీ మధ్యలో కాంగ్రెస్ నేతలు కూడా మేమున్నాం అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈటల నిజంగానే ప్రజలకు సేవ చేసి ఉంటే ఎందుకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని కాంగ్రెస్ ఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. అధికార పార్టీకి…
తెలంగాణలో జరగబోయే హుజూరాబాద్ ఎన్నికలపై మండిపడ్డారు సీపీఐ నేత నారాయణ. తెలంగాణాలో జరిగే ఎన్నికలు పగటి డ్రామాలా లేక పవిత్ర ఎన్నికల విధానాలా అని విమర్శించారు. ఎన్నికల విధానాలను భ్రష్టు పట్టించేవిగా వున్నాయన్నారు. ముందస్తు ప్రణాళికలో భాగం గానే దళిత బంధు పథకాన్ని ప్రారంభించారని, అయితే అందులో కూడా దళిత బంధు ఇచ్చినట్టే వుండాలి. పథకం ప్రయోజనాలు లబ్ధిదారులకు అందకూడదన్న చందంగా తయారైందన్నారు. కూడు కుండనిండుగుండాలి , బిడ్డమాత్రం బొద్దుగుండాలి ” అన్నట్టుగా వుందన్నారు నారాయణ. ఈనాటకాలలో…