Bhatti vikramarka: ఓసారి యూనివర్సిటీ కి సెక్యూరిటీ లేకుండా వెళ్లి చూడు అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మామిడిపల్లి ఎక్స్ రోడ్ పాదయాత్ర శిబిరం నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తలసాని కామెంట్స్ పై భట్టి ఫైర్ అయ్యారు.
Bhatti Vikramarka: కారు ఉంటే తప్ప యాదాద్రి శ్రీలక్ష్మీనారసింహా స్వామిని దర్శించుకునే అవకాశం లేకుండా పోయిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు యాదాద్రి జిల్లా దగిరిగుట్ట లో భట్టి విక్రమార్క కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట అత్యంత పవిత్రమైన ప్రదేశమన్నారు.
వి.హనుమంతరావు.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. పార్టీలో ఏం జరిగినా ఎవరూ పట్టించుకోకపోయినా వీహెచ్ మాత్రం వెంటనే స్పందిస్తారు. మొహమాటం లేకుండా కొబ్బరి కాయ కొట్టినట్టు మాట్లాడుతుంటారు. తాజాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలో బాగా సందడి చేశారు. కోలాటం ఆడి అటు కాంగ్రెస్ కార్యకర్తల్ని, ప్రజల్ని అలరించారు. ఖమ్మం జిల్లా మధిర మండలంలో సీఎల్పీనేత భట్టివిక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర జోరుగా సాగుతోంది. ఈ పాదయాత్రలో వీహెచ్ పాల్గొన్నారు. కార్యకర్తలను తన…
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్స్ పాదయాత్రకు అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రభుత్వంపై ఆయన మండిపడుతున్నారు. ప్రజల మధ్యే తిరుగుతూ వారి బాగోగులు విచారిస్తూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలు జీవోలను సృష్టిస్తూ పబ్బం గడుపుకుంటుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సీఎం కేసిఆర్ వరి వేయవద్దని ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెప్పారు. కానీ నకిలీ విత్తనాలు బాగా మార్కెట్ లోకి వస్తే కేసీఆర్ ఏం చేశాడని భట్టి అన్నారు. గతంలో…
తెలంగాణకు ఉప ఎన్నిక ఫీవర్ పట్టుకుంది. ఒక నియోజకవర్గం కోసం యావత్ రాష్ట్ర పాలనా యంత్రాంగం హుజూరాబాద్‌ని చుట్టేస్తోంది. నేతల మధ్య మాటలు కోటలు దాటుతున్నాయి. ప్రధాన పోటీ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్యే నెలకొని వుంది. కానీ మధ్యలో కాంగ్రెస్ నేతలు కూడా మేమున్నాం అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈటల నిజంగానే ప్రజలకు సేవ చేసి ఉంటే ఎందుకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని కాంగ్రెస్ ఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. అధికార పార్టీకి…