ఆక్స్‌ఫామ్ ఇండియాపై సీబీఐ సోదాలు నిర్వహించింది. భారత విదేశీ నిధుల నిబంధనల నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆక్స్‌ఫామ్ ఇండియా, దాని ఆఫీస్ బేరర్‌లపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కేసు నమోదు చేసింది. ఎఫ్‌సిఆర్‌ఎను ఉల్లంఘించినందుకు గాను గ్లోబల్ ఎన్‌జిఓ ఆక్స్‌ఫామ్‌కు చెందిన భారతీయ విభాగం వ్యవహారాలపై సిబిఐ విచారణకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం సిఫార్సు చేసిన కొద్ది రోజుల తర్వాత ఎఫ్‌ఐఆర్ కేసు నమోదు చేశారు. ఎఫ్సీఆర్ఏ(FCRA) కింద నమోదు చేసుకున్న తర్వాత కూడా ఆక్స్‌ఫామ్ ఇండియా ఇతర NGOలతో సహా వివిధ సంస్థలకు విదేశీ విరాళాలను బదిలీ చేయడం కొనసాగించిందని హోం మంత్రిత్వ శాఖ గుర్తించింది.
Also Read:Encounter Pradesh: యోగి హయాంలో ఎన్‌కౌంటర్లు.. యూపీ పోలీసుల లెక్కలు ఇవే..
ఆక్స్‌ఫామ్ ఇండియా 2013 నుంచి 2016 మధ్య నియమించబడిన బ్యాంక్ ఖాతాకు బదులుగా దాదాపు రూ. 1.5 కోట్లను నేరుగా తన ఫారిన్ కంట్రిబ్యూషన్ యుటిలైజేషన్ ఖాతాలోకి స్వీకరించింది. ఫారిన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్ (ఎఫ్‌సిఆర్‌ఎ) 2010 నిబంధనలను ఉల్లంఘిస్తూ 2019-20 ఆర్థిక సంవత్సరంలో సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ (సిపిఆర్)కి ఆక్స్‌ఫామ్ ఇండియా రూ. 12.71 లక్షలు మళ్లించిందని ఆరోపణలు ఉన్నాయి.
గత ఏడాది జనవరిలో ఆక్స్‌ఫామ్ ఇండియా ఎఫ్‌సిఆర్‌ఎ లైసెన్స్‌ను సస్పెండ్ చేసిన హోం మంత్రిత్వ శాఖ ఫిర్యాదు మేరకు తాము చర్యలు తీసుకున్నామని సిబిఐ తెలిపింది. ఇతర సంఘాలు లేదా లాభాపేక్ష కన్సల్టెన్సీ సంస్థలకు నిధులను బదిలీ చేయడం ద్వారా ఆక్స్‌ఫామ్ ఇండియా ఎఫ్‌సిఆర్‌ఎను దాటవేయాలని యోచిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతేడాది సెర్చ్ ఆపరేషన్‌లో ఆక్స్‌ఫామ్ ఇండియా కార్యాలయం నుంచి పలు ఇమెయిల్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ తెలిపింది. కాగా, పేదరికం, అసమానత, లింగ న్యాయం, వాతావరణ మార్పు వంటి సమస్యలపై పనిచేసే ఆక్స్‌ఫామ్ గ్లోబల్ కాన్ఫెడరేషన్‌లో ఆక్స్‌ఫామ్ ఇండియా ఒక భాగం.
Also Read:90 Minutes In 22 Shots : 90 నిమిషాల్లో 22 పెగ్ లు.. అంతలోనే..