కరోనా కాలంలో టెస్టులు చేయించుకోవడం సహజంగా మారింది. ప్రపంచంలో అనేక దేశాలు ప్రజలకు ఉచితంగా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రం తప్పని సరిగా టెస్టులకు ప్రభుత్వం నిర్ధేశించిన డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, అమెరికా లాంటి దేశాల్లో కరోనా పరీక్షల ధరలపై నియంత్రణ ఉండదు. దీంతో ఆసుపత్రులు సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఛార్జ్ చేస్తుంటాయి. అయితే, డల్లాస్ కు చెందిన ట్రెవిస్ వార్నర్ అనే వ్యక్తి కరోనా టెస్టులు చేయించుకున్నారు. పీసీఆర్ టెస్టులు చేయించుకున్న వార్నర్‌కు ఆసుపత్రి యాజమాన్యం ఏకంగా 54 వేల డాలర్లు బిల్లు వేసింది. దీంతో వార్నర్ షాక్ అయ్యాడు. పీసీఆర్ టెస్టులకు రూ.40 లక్షలు బిల్లు వేయడం చూసి వార్నర్ ఖంగుతిన్నాడు. అయితే, అతనికి మోలీనా హెల్త్‌కేర్ నుంచి ఇన్సూరెన్స్ ఉండటంతో ఆ బిల్లును సదరు కంపెనీకి పంపాడు. ఆ బిల్లుచూసి ఇన్సూరెస్ కంపెనీ సైతం షాక్ అయింది. ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి బిల్లును 54 వేల డాలర్ల నుంచి 16915 డాలర్లకు తగ్గించి చెల్లించారు.
Read: లైవ్: రాజమండ్రిలో అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన చిరంజీవి