రాష్ట్రపతి ముర్ము నేడు శ్రీ రామానుజాచార్య విగ్రహ సందర్శన
రాష్ట్రపతి ఇవాల ఉదయం 11.00-12.00 షేక్‌పేటలోని జి.నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మహిళా కళాశాల సందర్శన. విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశం కానున్నారు. సాయంత్రం 5.00-6.00 శంషాబాద్‌లోని శ్రీరామ్‌నగర్‌లో సమైక్యతామూర్తి శ్రీ రామానుజాచార్య విగ్రహ సందర్శించనున్నారు. ఇక రేపు (డిసెంబర్ 30)న ఉదయం 10.00-11.00 రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతి వనంలో శ్రీ రామచంద్ర మిషన్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అంగన్వాడీ, ఆశా వర్కర్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం సాంస్కృతిక మంత్రిత్వశాఖ, శ్రీ రామ చంద్ర మిషన్ కలిసి చేపడుతున్న ‘హర్ దిల్ ధ్యాన్, హర్ దిన్ ధ్యాన్’ ప్రచార కార్యక్రమం ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1.00గంటకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి విందు ఇవ్వనున్నారు.
జగిత్యాల జిల్లాలో కిడ్నాప్‌కలకలం
జగిత్యాల రూరల్ మండలం దరూర్ పట్టణంలోని సాయి జనతా గ్యారేజ్ కోటి కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. వారికి సాయి లహరి 12సంవత్సరాల బాలిక 7వ తరగతి చదువుకుంటుంది. పని నిమిత్తం బయటకు వచ్చిన బాలికను కొందరు దుండగులు అక్కడకు కారులో వచ్చారు. పరిసర ప్రాంతాల్లో ఎవరూ లేకపోవడం బాలిక ఒక్కటే అక్కడ వుండటం గమనించిన నలుగురు దుండగులు ఆ బాలికను కారులో ఎక్కించుకుని పరారయ్యారు. బాలిక ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఇరుగు పొరుగు వారిని అడిగిన, తెలియదనే సమాధానం చెప్పడంతో.. తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. అయితే.. కిడ్నాప్ కు గురైన బాలిక కారులో బంధించి నలుగురు దుండగులు ఫోన్ లో మాట్లాడుతుండటంతో.. బాలిక లహరి చాకచక్యంగా కారులో నుంచి కిందికి దూకేసింది. అక్కడనుంచి పరుగులు పెట్టింది. వారి వద్దనుంచి తప్పించుకుని బయటపడింది. అక్కడ కొందరు స్థానికులను చూసి వారి వద్దనుంచి తండ్రికి ఫోన్ చేసింది. స్థానికుల సహాయంతో తండ్రి ఇంటికి చేరింది లహరి. ఈఘటనపై బాలిక కుటుంబ సభ్యులు జగిత్యాల రూరల్ పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
శంషాబాద్ విమానాశ్రయంలో టీ షర్ట్ లో అక్రమ బంగారం
హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అక్రమ రవాణాకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. శంషాబాద్‌లో ఏదో ఒక అక్రమరవాణా వెలుగులోకి రావడం కలకలం సృష్టిస్తోంది. అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా అక్రమ రవాణా మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. దీంతో కేటుగాళ్లు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. దీంతో బంగారం అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతునే ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరో సారి విదేశీ బంగారం పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. సుధీర్ కుమార్ అనే ప్రయాణీకుడి వద్ద 47 లక్షల విలువ చేసే 827 గ్రాముల బంగారంను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.
రేణింగవరం వద్ద హైవే రన్‌వే ట్రైల్ రన్
బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం రేణింగవరం వద్ద నేడు నేషనల్ హైవే అథారిటీ అధికారులు హైవే రన్ వే ట్రైల్ రన్ నిర్వహించనున్నారు. రేణింగివరం, కొరిశపాడు మధ్య నిర్మించిన ఎయిర్ ప్యాడ్ జాతీయ రహదారుల పై విమానాల అత్యవసర ల్యాండింగ్‌కు అవసరమైన 3 నుంచి 4 కిలోమీటర్ల దూరం వరకు రహదారిని నిర్మించారు అధికారులు. నేడు ఉదయం 11 గంటలకు భారత వైమానికి దళానికి ( ఐఏఎఫ్) చెందిన ఓ కార్గో విమానం, నాలుగు ఫైటర్‌జెట్ యుద్ద విమానాలు జాతీయ రహదారి పై అత్యవసరంగా ల్యాండింగ్ కానున్నాయి. హైవే పై అత్యవసర సమయాల్లో విమానాలు దిగేందుకు వీలుగా ప్రత్యేకంగా రోడ్డును నిర్మించినట్లు వెల్లడించారు అధికారులు. దీంతో విమానాశ్రయాల నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించే సమయం తగ్గుతుందని చెప్పారు.
కేరళలో ఎన్ఐఏ రైడ్స్.. పీఎఫ్ఐ లక్ష్యంగా 56 చోట్ల దాడులు..
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)పై మరోసారి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దాడులు నిర్వహిస్తోంది. గురువారం ఉదయం నాలుగు గంటల నుంచే కేరళ వ్యాప్తంగా రైడ్స్ చేస్తోంది. పీఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు ఇళ్లు, ఆఫీసుల్లో దాడులు నిర్వహిస్తోంది. మొత్తం 56 చోట్ల ఈ రైడ్స్ జరుగుతున్నాయి. ఇటీవల పీఎఫ్ఐని భారత ప్రభుత్వం నిషేధించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో పాటు అక్రమ నిధులు కేసులో ఎన్ఐఏ, ఈడీలు విచారణ జరపుతున్నాయి. గతంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పీఎఫ్ఐపై దాడులు నిర్వహించిన ఎన్ఐఏ మరోసారి పీఎఫ్ఐ ఆఫీస్ బేరర్లు, సభ్యులు, ఇతర కార్యకర్తలు ఇళ్లలో సోదాలు చేస్తోంది.
చైనాలో భారతీయ మెడిసిన్స్‌కు భారీ డిమాండ్
చైనాలో కోవిడ్-19 విలయతాండవం సృష్టిస్తోంది. ఆ దేశంలో ఎప్పుడూ లేని విధంగా అక్కడ కేసులు నమోదు అవుతున్నాయి. మరణాలు కూడా అదే స్థాయిలో నమోదు అవుతున్నాయి. దేశంలోని అన్ని ఆస్పత్రులు కోవిడ్ రోగులతో నిండిపోయాయి. దీంతో పాటు చాలా చోట్ల మందుల కొరత వేధిస్తోంది. దీంతో చైనీయులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా ఇండియన్ మెడిసిన్స్ కొనేందుకు మొగ్గు చూపిస్తున్నారు. బ్లాక్ మార్కెట్ లో భారతీయ మందులను కొనుగోలు చేస్తున్నారు.
వివాదాస్పద బీజేపీ ఎంపీపై కేసు.. సాధ్వి ప్రజ్ఞాపై కాంగ్రెస్ ఆగ్రహం
బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్(సాధ్వి ప్రజ్ఞా) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక శివమొగ్గలో రెచ్చగొట్టే ప్రకటన చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. హిందూ జాగరణ వేదిక దక్షిణ ప్రాంత సదస్సులో మాట్లాడుతూ.. ముస్లింలను కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఈ భోపాల్ ఎంపీపై ఫిర్యాదు నమోదైంది. ఎంపీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రగ్యా ఠాకూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ మండిపడ్డారు. బీజేపీ ఎంపీ చేసిన ‘‘ కత్తులకు పదును పెట్టండి’’ అనే వ్యాఖ్యలపై బుధవారం హోం మంత్రి అమిత్ షాను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. అమిత్ షాను ప్రగ్యా ఠాకూర్ అపహాస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సెటైర్లు వేశారు. ప్రగ్యా చేసిన వ్యాఖ్యలు హింసకు దారి తీస్తాయని.. ఇందులో కొంత ప్రణాళిక ఉందని అన్నారు. దేశంలో భద్రత కల్పించడం కేంద్ర హోంమంత్రి విధి అని.. కానీ సాధ్వీ వ్యాఖ్యలు హోంమంత్రి పనికిరారని చెప్పే విధంగా ఉన్నాయని విమర్శించారు.
Elephant Fight: ఏనుగులకు కోపమొచ్చింది.. కొట్టుకున్నాయి..