ట్రంప్ మళ్లీ విజయం సాధిస్తారు…ఎలాన్ మస్క్ జోస్యం
డొనాల్డ్ ట్రంప్ ను అరెస్ట్ చేసి, ఆయనపై నేరాలు మోపితే 2024 అధ్యక్ష ఎన్నికల్లో భారీ విజయం సాధించడం ఖాయం అని ప్రపంచ టాప్-1 బిలియనీర్ ఎలాన్ మస్క్ జోస్యం చెప్పారు. వచ్చే వారం ట్రంప్ పై అభియోగాలు మోపుతారనే వార్తలపై ఎలాన్ మస్క్ స్పందించారు. ఇదే జరిగితే ఆయన అద్భుత విజయం ఖాయమని అన్నారు. ఈ నెల 21న తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తనలో లైంగిక సంబంధాలు ఉన్నాయని ఆరోపించిన మహిళను డబ్బులో ప్రలోభపెట్టినట్లు వచ్చని అభియోగాలపై తనను అరెస్ట్ చేయవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తన సొంత సోషల్ మీడియా ‘‘ ట్రూల్ సోషల్’లో ఈ మేరకు శనివారం పోస్ట్ చేశారు. మాన్ హట్టన్ అటార్నీ ఆఫీస్ నుంచి తనకు సమాచారం ఉందని అన్నారు. రాజకీయంగా అవినీతిలో ఉందని మాన్ హట్టన్ అటార్నీ కార్యాలయంపై విమర్శలు గుప్పించారు. నెక్ట్స్ వారం తాను అరెస్ట్ చేయబడతానని, తన మద్దతుదారులు నిరసన తెలిపాలని సూచించారు. అమెరికాను మనం రక్షించాలని, మనం చూస్తూ కూర్చుంటే వారు దేశాన్ని చంపుతున్నారని డెమోక్రాట్లను విమర్శించారు. మాన్ హట్టన్ జిల్లా అటార్నీ కార్యాలయం ట్రంప్ పై అభియోగాలు మోపితే.. ఒక మాజీ అధ్యక్షుడిపై ఇలా అభియోగాలు మోపినట్లు అవుతుంది.
2019లో దారుణమయిన ఓటమిని మర్చిపోయారా?
చంద్రబాబు మాటలు ఆశ్చర్యం, నవ్వు వేస్తున్నాయన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. సాధారణ ఎన్నికల్లో గెలిచినంత ఆత్రుత చంద్రబాబులో కనిపించింది.మూడు ఎమ్మెల్సీల్లో గెలిచి మా పై వ్యాఖ్యలు చేయటం ఆశ్చర్యంగా ఉంది. 2019లో మిమ్మల్ని ప్రజలు తుక్కు తుక్కుగా తొక్కారుగా. ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అడ్రెస్ లేకుండా ఓడిపోయిన పరిస్థితి గురించి ఏం చెబుతారు? చంద్రబాబు వ్యాఖ్యలు పిట్టల దొర, కమెడియన్ మాట్లాడినట్లు ఉంది. నిజంగా చంద్రబాబుకు దుమ్ము ధైర్యం ఉంటే 175 స్థానాల్లో పోటీ చేయి. ఒక్క మాట అయినా అనగలవా?దత్త పుత్రుడు లేకుండా అడుగు బయటపెట్ట లేని పరిస్థితి ఎందుకు? పశ్చిమ రాయలసీమ ఎన్నికల్లో అధికారులు వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉంది. టీడీపీలోని పెద్ద పెద్ద నాయకులు ఏజెంట్లుగా వచ్చి కూర్చున్నారు. ఈ దబాయింపులకు ఎందుకు పార్టీ. అసలు మేం అధికారంలో ఉన్నామా అనే మాకే ఒక్కోసారి అనుమానం వస్తుంది. మేం ఆధారాలతో అవకతవకలు చూపించామా లేదా?? ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాటం చేశాం. బుల్డోజ్ చేయటం మాకు చేతకాదు. అధికారులు మా అడుగులకు మడుగులు ఎత్తేటట్లు అయితే ఫలితాలు ఇలా ఉండవు.స్కిల్ డెవలప్మెంట్ స్కాం లాంటివి జరిగేవి.చంద్రబాబు అంబేద్కర్ చెప్పాం వ్యాఖ్యలు చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. ఎవరైనా దళాతుడిగా పుట్టాలనుకుంటారా అన్న వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు గురించి చెప్పించుకునే పరిస్థితిలో వైసీపీ లేదు. చంద్రబాబు రిజెక్టెడ్ పొలిటీషియన్. ఈ జీవితంలో శాసనసభ లో అడుగు పెట్టే అవకాశాన్ని కోల్పోయాడన్నారు సజ్జల. పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల అవకతవకల పై సహేతుకమైన ఆధారాలు చూపించాం. రిటర్నింగ్ అధికారి అలా ఎందుకు నిర్ణయం తీసుకున్నారో మాకు తెలియదు. కోర్టులో సవాలు చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నాం అన్నారు సజ్జల.
బీజేపీ నేత వ్యాఖ్యలు.. కలెక్టరేట్ ముందు ముస్లింల ప్రార్థనలు..
బీజేపీ నేత, మాజీ మంత్రి ఈశ్వరప్ప వ్యాఖ్యలపై ముస్లింలు మండిపడుతున్నారు. ఆయన ఇటీవల నమాజ్, అల్లాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ముస్లింలు నిరసన తెలుపుతున్నారు. కర్ణాటక శివమొగ్గ జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ముందు ముస్లిం సంఘాల సభ్యులు భారీగా చేరుకుని ఆజాన్ పఠించారు. భారీగా హాజరైన ముస్లింలు ప్రార్థనలు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ముందు కూడా ఇదే విధంగా చేస్తామని హెచ్చరించారు. ఈశ్వరప్ప మా తల్లిదండ్రులపై మాట్లాడితే వదిలేస్తాం, కానీ అల్లా, అజాన్ గురించి కామెంట్స్ చేశారని, కావాలంటే కర్ణాటక అసెంబ్లీ ముందు కూడా అజాన్ చదువుతాం, మేం పరికివాళ్ల కాదని, ముస్లిం సమాజం అంతా ఏకం కావాలని అని కలెక్టరేట్ ముందు హాజరైన ముస్లింలు అన్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై శివమొగ్గ పోలీసులు 107 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం చేయవద్దని, వారిని వదిలిపెట్టబోమని పోలీసులు హెచ్చరించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు, విచారణ జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఎమ్మెల్సీ ఫలితాలతో మా బాధ్యత పెరిగింది
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ మథనం ప్రారంభం అయింది. సజ్జల రామకృష్ణారెడ్డి శుభం పలికారు. అధికారంలో ఉన్నామా..? అనే అనుమానం సజ్జలకు కలగడం శుభ పరిణామం.రెండు రోజుల ముందే ప్రజలు ఉగాది పంచాంగం చెప్పారని చంద్రబాబు కామెంట్ చేశారు.. ఆ వ్యాఖ్యలను సజ్జల ఎండార్స్ చేశారు.ఈ రాష్ట్రంలో అరాచకమే ఉందని ప్రజలెప్పుడో గుర్తించారు.. ఆ ఫలితమే ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్.ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో వైనాట్ 175 అనే గొంతులు మూగబోయాయి.ప్రజలు.. ప్రజాస్వామ్య అనే పదాలు వైసీపీ డిక్షనరీలోనే లేవు. వైసీపీ డిక్షనరీలో లేని పదాలను సజ్జల మాట్లాడ్డం విడ్డూరంగా ఉందన్నారు. ఒక్క షాకుతోనే ప్రజలురర సజ్జలకు గతాన్ని గుర్తు చేశారు.. ప్రజలనే పదాలను గుర్తు చేశారు. బుల్డోజ్ అనేది వైసీపీ ఇంటి పేరు. మాస్కు అడిగిన డాక్టర్ సుధాకర్ పై చేసిన అరాచకం నుంచి ఎన్నికల్లో గెలిచిన పశ్చిమ రాయలసీమ అభ్యర్థిని లాక్కెళ్లి అరెస్ట్ చేయడం బుల్డొజ్ చేయడం కాదా..?ఈ ఫలితాలతో అధికార పార్టీ మరిన్ని అరాచకాలు చేస్తుందని మేం నమ్ముతున్నాం.. మేం ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నాం.మీ పార్టీ ఎమ్మెల్యేల మీద సీఎంకే నమ్మకం లేదు.. అందుకే ఎమ్మెల్యేలకు మంత్రులని పర్యవేక్షకులుగా పెట్టారు.ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేం పోటీ చేయకూడదని సజ్జల ఎలా అంటారు..? ఎమ్మెల్సీ గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు కావాలి.. మా సంఖ్యా బలం 23.మా దగ్గరున్న ఎమ్మెల్యేలను లాక్కుంది ఎవరు..?పోటీ చేయడాన్ని కూడా తప్పు పడతారా..?మీ ఓటర్లు వేరా..? ముఖం మీద ఎవరూ మేం ఫలానా ఓటరని స్టిక్కర్ వేసుకుంటారా..?పులివెందుల నుంచి ఓ ఎమ్మెల్సీ టీడీపీ నుంచి గెలిచారు.. త్వరలో మరో ఎమ్మెల్యే కూడా టీడీపీ నుంచి గెలవబోతున్నారు.ఈ ఎన్నికల ఫలితాలు మా బాధ్యతను పెంచాయి.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అప్పుల పాలైంది.. రోడ్డున పడ్డ నిరుద్యోగులు
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కుమ్మరి తండాకు చేరుకుంది. టీఎస్పీఎస్సీ పరీక్షల పేపర్ లీకేజీని నిరసిస్తూ ఓయూ జేఏసీ, ఎన్ఎస్.యూ.ఐ ఆధ్వర్యంలో జరిగిన నిరసన దీక్షలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు. ప్రశ్నాపత్రం లీకేజీపై భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను కేసీఆర్ ప్రభుత్వం రోడ్డున పడేసిందన్నారు. టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ సభ్యులను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. కమిషన్ బోర్డు నియామకం చేసిన ప్రభుత్వం కూడా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ తెలంగాణ ప్రభుత్వాన్ని కల్లోలితంగా చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల డిమాండ్లపై స్పందించాలి లేకుంటే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను సమయత్తం చేస్తాం.. ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఉద్యమం చేపడుతామని భట్టి విక్రమార్క అన్నారు. నిరుద్యోగుల జీవితాలను ఆగం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని డిమాండ్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పాలనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లక్షల కోట్ల అప్పుల్లో ఉందని భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడానికే తమ పాదయాత్ర అంటూ భట్టి విక్రమార్క తెలిపారు.
ఎవరు కలిసి వచ్చినా కలుపుకుంటాం
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు టీడీపీలో కొత్త ఉత్సాహాన్ని నింపాయనే చెప్పాలి. రాబోయే కాలంలో వచ్చే ఎన్నికలకు ఎమ్మెల్సీ ఎన్నికలు పరాకాష్ట అంటున్నారు మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైసీపీ చేసిన అరాచకాలు..దుర్మార్గాలకు విద్యావంతులు తగిన బుద్ది చెప్పారు. అన్ని పార్టీలు కలిసి వచ్చాయి.. మేము ఒక్కరే అని సజ్జల అంటున్నాడు..టీడీపీ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అందుకే అందరూ మాతో ఉన్నారు..వైసీపీ నాయకుల మాటలు విని దారుణాలకు పాల్పడిన పోలీసు అధికారులను వదిలిపెట్టం అన్నారు సోమిరెడ్డి. ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు పరాకాష్ట అన్నారు. ఏ పార్టీలు.మాతో వచ్చినా కలుపుకుంటాం.అందరితో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది.మంత్రి కాకాణి, వై.సి.పి. ఎం. ఎల్.సి. అభ్యర్థి శ్యామ్ ప్రసాద్ రెడ్డిల మధ్య డబ్బుల విషయంలో సజ్జల జోక్యం చేసుకున్నారు.అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు మంత్రి కాకాణి దూరంగా ఉన్నాడన్నారు.
పులివెందులలో జగన్ ను ఓడించే మగాడు పుట్టలేదు
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు టీడీపీకి బూస్ట్ ఇచ్చాయనే చెప్పాలి. అయితే ఏపీ మంత్రులు మాత్రం ఈ ఎన్నికలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. 108 నియోజకవర్గాల్లో ప్రజలు మిమ్మల్నే గెలిపించారు అని చంద్రబాబు అంటున్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు మాదే హవా అని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. అదే నిజం అయితే..నా సవాలును స్వీకరించాలన్నారు మంత్రి ఆర్ కె రోజా. అచ్చెన్నాయుడు, బాలకృష్ణ , చంద్రబాబు తమ పదవులకు రాజీనామా చేసి మళ్ళీ గెలిచి చూపించాలి. చనిపోయే ముందు నోట్లో తీర్థం పోసినట్లు పూర్తిగా ఓడిపోయే టీడీపీకి గ్రాడ్యుయేట్లు తీర్థం పోశారు. తీర్థం పోస్తే పోయే వాళ్ళు ప్రశాంతంగా వెళతారని నమ్మకం వుంది. పులివెందులలో జగన్ ను ఓడించే మగాడు ఇంకా పుట్టలేదు.వై నాట్ పులివెందుల అని నాగబాబు అనటం పెద్ద జోక్. సొంత గడ్డ పైనే అన్నదమ్ములు నాగబాబు , పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఓడిపోయారు…మొదటి సారి టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ల్లో పోటీ చేశాం. ఈ ఎన్నిక విధానం వేరు. ఇప్పుడు వచ్చిన అనుభవంతో వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరుతాం అన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వర రావు మాట్లాడుతూ.. టిడిపి మూడింటి గెలుపుని చూసి జబ్బలు కొట్టుకుంటున్నారు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు టిడిపిని లాక్కున్నారు.
హమ్మయ్య మా మహేష్ ని వదిలేశారా?
సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలిసినవి రెండే రెండు. ఒకటి సినిమా.. రెండు కుటుంబం. షూటింగ్స్, వెకేషన్స్.. ఇవి తప్ప మహేష్ కు బయట వ్యాపకాలు ఏమి లేవు. ఏడాదిలో ఖచ్చితంగా నాలుగుసార్లు అయినా కుటుంబంతో వెకేషన్ కు వెళ్లకపోతే ఆయనకు ఏడాది గడిచినట్టే అనిపించదు. ఈ మధ్యనే కుటుంబంతో కలిసి మహేష్ వెకేషన్ కు వెళ్లి వచ్చాడు. ప్రస్తుతం మహేష్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ ఏడాది మొదట్లో మొదలైన ఈ సినిమా మధ్య మధ్యలో బ్రేకులు వేస్తూ ముందుకు వెళ్తోంది. కృష్ణ మృతి వలన కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది. ఆ తరువాత మహేష్ కుటుంబంతో కలిసి వెకేషన్ కు వెళ్లారు.ఇన్నిరోజులు తరువాత ఈ మధ్యనే మహేష్ సెట్ లో అడుగుపెట్టాడు. ఇప్పుడప్పుడే త్రివిక్రమ్, మహేష్ ను వదిలేలా కనిపించడం లేదు. అందుకే ఈసారి వెకేషన్ ను కేవలం నమ్రత- సితారనే ప్లాన్ చేసినట్లు కనిపిస్తున్నారు.
ఒక్క మ్యాచ్ కూడా గెలవలేని స్థితిలో శ్రీలంక
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో పర్యాటన శ్రీలంక జట్టు ఓటమి దిశగా పయనిస్తుంది. తొలి ఇన్నింగ్స్ లో 164 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే ఫాలో ఆన్ ఆడుతున్న లంకేయులు మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేశారు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కు (580/4) ఇంకా 303 పరుగులు వెనకబడి శ్రీలంక ఉంది. ఓవర్ నైట్ స్కోర్ 26/2 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. మైఖేల్ బ్రేస్ వెల్(3/50), మ్యాచ్ హెన్రీ(3/44), టీమ్ సౌథీ( 1/22), డౌడ్ బ్రేస్ వెల్(1/19), టిక్నర్(1/21 ) ధాటికి తొలి ఇన్నింగ్స్ లో 164 పరుగులకే చాపట్టేసింది. శ్రీలంక ఇన్సింగ్స్ లో కెప్టెన్ దిముత్ కరుణరత్నే(89) టాప్ స్కోరర్ గా నిలిచాడు. న్యూజిలాండ్ పిలుపుతో మేరకు ఫాలో ఆన్ ఆడుతున్న శ్రీలంక.. సెకెండ్ ఇన్సింగ్ లో 2 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసి ఇన్సింగ్స్ పరాభవాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. సెకెండ్ ఇన్సింగ్స్ లోనూ కరుణరత్నే951) హాఫ్ సెంచరీతో రాణించగా.. కుశాల్ మెండిస్ పోరాడుతున్నాడు. సౌథీ, డౌగ్ బ్రేస్ వెల్ తలో వికెట్ దక్కిది. అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 580 పరుగులు చేసి ఇన్సింగ్స్ ను డిక్లేర్ చేసింది. కేన్ విలియమ్సన్(215), హెన్రీ నికోల్స్(200) డబుల్ సెంచరీలతో చెలరేగగా.. కాన్వే 78 పరుగులు చేశాడు. కాగా, రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేసి, భారత్ ను వెనక్కునెట్టి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరాలని కలలు కన్న శ్రీలంక ప్రస్తుతం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేని స్థితిలో ఉంది. తొలి టెస్టులో సూపర్ సెంచరీతో శ్రీలంక విజయావకాశాలను దెబ్బకొట్టిన విలియమ్సన్ ఈ మ్యాచ్ లోనూ ఆ జట్టును గెలవకుండా చేశాడు.