ఈ నెల 27న ప్రధాని పరీక్షా పే చర్చ.. విద్యార్థులతో మాట్లాడనున్న మోదీ
పరీక్షల కారణంగా ఎదురయ్యే ఒత్తిడిని జయించేందుకు ప్రధాని మోదీ విద్యార్థులకు గైడెన్స్ ఇస్తూ ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం జరుగుతున్న ఈ ప్రోగ్రామ్.. 2023లో కూడా జరగనుంది. పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. ప్రతి ఏడాది వార్షిక పరీక్షలకు ముందు ‘పరీక్షా పే చర్చ’ పేరుతో విద్యార్థులతో ప్రధాని ఇంటరాక్ట్ అవుతారు. ఈ సారి ఈ కార్యక్రమంలో విద్యార్థుల భాగస్వామ్యం పెంచే విధంగా బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని విద్యార్థుల్లోకి తీసుకెళ్లేందుకు వందలాది పాఠశాలల్లో వివిధ రకాల పోటీలు నిర్వహించింది. ప్రధాని మోడీ రాసిన ‘ఎగ్జామ్ వారియర్స్’ పుస్తకాలను పంపిణీ చేసింది. పరీక్షా పే చర్చా 2023కి ముందు ప్రధాని నరేంద్ర మోదీ తన “ఎగ్జామ్ వారియర్స్” పుస్తకాన్ని విద్యార్థుల కోసం కొత్త మంత్రాలతో నవీకరించారు. ఈ పుస్తకం ఇప్పుడు విడుదల చేయబడింది. 13 భారతీయ భాషలలో అందుబాటులో ఉంది. వివిధ రాష్ట్రాల గవర్నర్లు తమ తమ రాష్ట్రాల్లో పుస్తకాన్ని ఆవిష్కరించారు.ఎగ్జామ్ వారియర్స్ అనేది పరీక్షా మంత్రాలు, బోర్డు పరీక్షలకు చేరుకుంటున్న విద్యార్థుల కోసం ఒత్తిడి నిర్వహణ చిట్కాలతో నిండిన పుస్తకం. మోడీ పుస్తకం తాజా ఎడిషన్ 13 భాషలలో అందుబాటులో ఉంది.
బీబీసీ డాక్యుమెంటరీ ట్వీట్లను బ్లాక్ చేసిన కేంద్రం
ధాని నరేంద్రమోదీపై బీబీసీ డాక్యుమెంటరీ దేశంతో పాటు బ్రిటన్ లో కూడా తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. 2002లో గుజరాత్ లో జరిగిన అల్లర్లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ప్రమేయం ఉందంటూ.. బీబీసీ ‘‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’’అనే పేరుతో రెండు భాగాల సిరీస్ రూపొందించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం చాలా ఆగ్రహంగా ఉంది. దీన్ని వలసవాద మనస్తత్వంగా, తప్పుడు ప్రచారంగా భారత విదేశాంగ శాఖ విమర్శించింది. దీనిపై బ్రిటన్ పార్లమెంట్ లో కూడా చర్చ జరిగింది. పాక్ మూలాలు ఉన్న ఎంపీ హుస్సెన్ గుజరాత్ అల్లర్లకు మోదీనే బాధ్యుడని నిందిచాడు. అయితే దీన్ని యూకే ప్రధాని రిషి సునాక్ తీవ్రంగా తప్పుపట్టారు. వ్యక్తిగతంగా ప్రతిష్ట దిగజార్చేలా మాట్లాడకూడదని సూచించాడు.
రేపే ఏపీలో కానిస్టేబుల్ రాతపరీక్ష.. అభ్యర్థులకు కొన్ని సూచనలు
ఏపీలో కానిస్టేబుల్ రాతపరీక్షకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి ఎంట్రీ ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ పరీక్ష జరగనుంది. 6100 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏపీ కానిస్టేబుల్ పరీక్ష కు సంబంధించి ముఖ్యమైన సూచనలు చేశారు.
* ఏపీలో 6,100 కానిస్టేబుల్ పోస్టులకు ఆదివారం ప్రిలిమినరీ పరీక్ష ఉ.10 గంటల నుంచి మ. 1 వరకు జరుగుతుంది.
* ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లవచ్చు. ఉదయం 10 గం. తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.
* అభ్యర్థులు మొబైల్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, వాలెట్,నోట్స్ వంటి వాటికి నో ఎంట్రీ
* అభ్యర్థులు తమ హాల్ టికెట్, పెన్, ఆధార్ కార్డు/రేషన్ కార్డు లాంటి గుర్తింపు కార్డు కచ్చితంగా తీసుకురావాలి. పరీక్ష రాసేందుకు బ్లూ/బ్లాక్ పాయింట్ ని మాత్రమే వాడాలి
* ఇవ్వబడిన నిర్దిష్ట సమయంలో 200 ప్రశ్నలకు సమాధానం రాయాలి. అభ్యర్థి సమయపాలన పాటించాలి. లేకుంటే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం కష్టం
* అన్ని ప్రశ్నలకు సమానమైన మార్కులను రిక్రూట్మెంట్ బోర్డు వారు కేటాయించారు.
న్యాయవాదుల నకిలీ సర్టిఫికెట్లపై కీలక దర్యాప్తు
అన్నింటా నకిలీలు రాజ్యమేలుతున్నాయి. న్యాయవాదుల నకిలీ సర్టిఫికెట్ల పై దర్యాప్తు కొనసాగుతోంది. తుళ్లూరు డీఎస్పీ పోతురాజు నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై కీలక విషయాలు వెల్లడించారు. నకిలీ న్యాయవాదుల కేసులో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం అన్నారు. తుళ్లూరు సీఐ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ఇతర రాష్ట్రాలకు బృందాలు వెళ్ళనున్నాయన్నారు. పేరు. యూజీసీ గుర్తింపు లేని యూనివర్సిటీ ల పేరు తో సర్టిఫికెట్ల ను సమర్పించిన న్యాయవాదుల పై కేసులు నమోదు చేస్తామన్నారు. బార్ కౌన్సిల్ సెక్రటరీ పద్మావతి ఫిర్యాదుతో ఐదుగురిపై కేసు నమోదు చేసాం అని చెప్పారు. ఆరోపణలు ఎదుర్కుంటున్న ఐదుగురిలో ఇద్దరు మహిళా న్యాయవాదులు ఉన్నారన్నారు. బోథ్ గయ యూనివర్సిటీ బీహార్, డిబ్రుఘడ్ యూనివర్సిటీ అస్సాం, మమ్మై యూనివర్సిటీ యూపీలనుండి లా డిగ్రీ లు పొందినట్లు నకిలీ సర్టి ఫికెట్ లను సమర్పించారు కొందరు ఫేక్ న్యాయవాదులు. గత మూడు సంవత్సరాలుగా అడ్వకేట్ లు నిర్వహించిన కార్యకలాపాలపై ఆరోపణలు వచ్చాయి. యూనివర్సిటీ ల నుండి వచ్చిన సర్టిఫికెట్ లపై క్రాస్ చెక్ చెక్ చేసింది బార్ కౌన్సిల్. సర్టిఫికెట్లు నకిలీవి అని నిర్ధారించి పోలీసులకు ఫిర్యాదు చేశారు బార్ కౌన్సిల్ సెక్రటరీ పద్మావతి. ఈ వ్యవహారం ఏపీలో సంచలనంగా మారింది.
ఆర్టీసీ బస్టాండ్‌లో సమ్మె సైరన్… నిలిచిన అద్దె బస్సులు
కరీంనగర్ లో ఆర్టీసీ బస్టాండ్‌లో సమ్మె సైరన్ మోగింది. బస్సు డ్రైవర్ల సమ్మె కారణంగా ఇవాళ తెల్లవారుజాము నుంచే ఇతర ప్రాంతాలతో పాటు గ్రామాలకు వెళ్లే అద్దె బస్సులు నిలిచిపోయాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల నుంచి కరీంనగర్ కు వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు కూడా సమయానికి పాఠశాలలు, కళాశాలలకు చేరుకోలేకపోతున్నారు. నామమాత్రపు వేతనాలతో పాటు వేధింపులు కూడా తీవ్రంగా మారాయని బస్సు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ అధికారుల వివక్ష, వేధింపులను ఆపాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. నేడు ఉదయం కరీంనగర్ ఆర్టీసీ డిపో ఎదుట బస్సు డ్రైవర్లు తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేయడంతో బస్ స్టేషన్ పరిసరాలు దద్దరిల్లాయి. బస్సు డ్రైవర్ల నిరసనకు సిఐటియు కూడా మద్దతు తెలపడంతో ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. దాదాపు నెల రోజుల క్రితం ఇదే తరహాలో సమ్మె చేయడంతో అధికారులు అద్దె బస్సుల యాజమాన్యంతో చర్చలు జరిపి ఆందోళనలు విరమించారు. ఇవాళ మళ్లీ అదే డిమాండ్లతో అద్దె బస్సుల డ్రైవర్లు నిరసనకు దిగారు. సమ్మె కారణంగా అద్దె బస్సులు, ప్రైవేట్ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో గ్రామీణ ప్రాంతాల ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆర్టీసీ డిపోలపై పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు.
చైనా బోర్డర్‌లో ఇండియా భారీ సైనిక విన్యాసాలు
ఇండియా-చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ నిన్న చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) సైనికులతో మాట్లాడారు. లడఖ్ వద్ద వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వద్ద సైనికులతో యుద్ధ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. దీంతో చైనా మరేదైనా కుట్ర చేస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ అలర్ట్ అయింది. చైనాతో కొనసాగుతున్న ప్రతిష్టంభన మధ్య భారత్ భారీగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. ఇటీవల తరలించిన డ్రోన్ స్క్వాడ్రన్‌లతో సహా ఈశాన్య ప్రాంతంలోని అన్ని ప్రధాన వైమానిక స్థావరాలను కలుపుకుని భారత వైమానిక దళం ‘ప్రళయ్’ విన్యాసాలు చేయనున్నట్లు సమాచారం. భారత వాయుసేన రవాణా, ఇతర విమానాలతో పాటు రఫెల్, సుఖోయ్ ఎస్యూ-30 ఫైటర్ జెట్లతో వైమానిక దళం సైనిక విన్యాసాలు చేసింది. రాబోయే రోజుల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థను రంగంలోకి దింపి వైమానికి విన్యాసాలు చేసే అవకాశం ఉంది. హసిమారా, తేజ్ పూర్, చబువా వంటి ఎయిర్ బేసులు కేంద్రంగా వైమానిక విన్యాసాలు చేస్తున్నారు.
ట్విట్టర్‌లో కొత్త ఫీచర్స్..అప్‌డేట్ ఇచ్చిన మస్క్
ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ మరో అప్‌డేట్‌తో ముందుకు వచ్చారు. ఈ మైక్రో బ్లాగింగ్ సైట్‌ను సొంతం చేసుకున్నప్పటి నుంచి కొత్త నిర్ణయాలు తీసుకుంటున్న మస్క్ శనివారం కొత్త అప్‌డేట్ ఇచ్చారు.”రానున్న నెలల్లో ఇతర దేశాలు, సంస్కృతులకు చెందిన ప్రజలు చేసే అద్భుతమైన ట్వీట్లను ట్విట్టర్ ట్రాన్స్‌లేట్ చేస్తుంది. అలాగే వాటిని ఇతరులకు రికమెండ్ కూడా చేస్తుంది. ఇతర దేశాల్లో ప్రతిరోజూ ఎన్నో అద్భుతమైన ట్వీట్లు ఉంటాయి. మరీ ముఖ్యంగా జపాన్ నుంచి” అంటూ మస్క్ పోస్ట్ చేశారు. రికమెండ్ చేయడానికి ముందే వాటిని ట్రాన్స్‌లేట్ చేస్తామని తెలిపారు. మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన దగ్గరి నుంచి సంచలన నిర్ణయాలే తీసుకుంటున్నారు. అందులో బ్లూ టిక్ కూడా ఒకటి. రాజకీయ నాయకులు, ప్రముఖులు, జర్నలిస్టులు, ఇతర ముఖ్యమైన వ్యక్తుల ఖాతాలకు వెరిఫై బ్లూ టిక్ ఇచ్చేవారు. తాజాగా బ్లూ సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలను ప్రకటించారు. ఇటీవల కూడా ఆయన కొన్ని అప్‌డేట్లు ఇచ్చారు. ముఖ్యంగా రికమెండెడ్ vs ఫాలోడ్ ట్వీట్లను తేలికగా కదల్చడం, యూజర్ ఇంటర్ఫేస్‌లో మార్పులు,
ఆభరణాలు చేయమని ఆర్డర్ ఇస్తే.. గోల్డ్ స్మిత్ పరార్
ఆభరణాలు తయారు చేయమని బంగారం ఇస్తే దానితో ఉడాయించాడు ఓ నగల తయారుదారుడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని నారాయణగూడలో చోటుచేసుకుంది. నారాయణగూడలోని ఓ షాపు పెట్టుకుని నగలు తయారు చేస్తున్న గోల్డ్ స్మిత్ గణేష్ చంద్ర దాస్.. దాదాపు కోటి రూపాయల విలువ గల బంగారు ఆభరణాలతో ఉడాయించాడు. అసలేం జరిగిందంటే.. బషీర్‌బాగ్‌లోని శ్రీయాష్ జ్యూవెల్లర్స్ యజమాని ఆనంద్ కుమార్.. కోటి రూపాయల విలువ చేసే బంగారాన్ని ఆభరణాల తయారీకి గోల్డ్ స్మిత్ గణేష్ చంద్ర దాస్‌కు ఇచ్చాడు. ఆభరణాల తయారీ కోసం బంగారం తీసుకున్న గణేష్ చంద్ర దాస్.. తిరిగి ఇవ్వలేదు.దీంతో ఆభరణాలు తయారు చేసే గణేష్ చంద్ర దాస్ షాపుకు వెళ్లి చూడగా పరారీలో ఉన్నాడు. దీంతో బాధిత యజమాని నారాయణ గూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తు్న్నారు. నమ్మి బంగారం ఇస్తే ఇలా మోసానికి పాల్పడ్డాడని జ్యువెల్లర్స్ యజమాని ఆనంద్ కుమార్ పోలీసుల ఎదుట వాపోయారు.