శరీర నిర్మాణంలో విటమిన్ డీ కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరంలేదు. విటమిన్ డి శరీరంలో తగిన పరిమాణంలో ఉంటే, కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొనవచ్చని, కరోనాపై పోరాటానికి విటమిన్ పాత్ర కీలకం అని తెలంగాణ వైద్యబృందం పరిశోధనలో తేలింది. ఆరునెలలపాటు విటమిన్ డి పాత్రపై వైద్యబృందం పరిశోధన చేశారు. పల్స్ ఢీ థెరపీ పేరుతో ఈ పరిశోధన జరిగింది. విటమిన్ డి శ్వాస కోశ వ్యాధుల నుంచి కాపాడుతుందని స్పానిష్ ఫ్లూ సమయంలో నిర్ధారణ జరిగిందని వైద్యనిపుణులు పేర్కొన్నారు. ఎంత మోతాదులో ఇవ్వాలి అనే దానిపై స్పష్టత రాలేదని, శరీరంలో విటమిన్ డి స్థాయి 40-60 ఎన్‌జీ-ఎంఎల్ మద్యలో ఉంటే శరీరంలో ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డు కుంటుందని, అదే విధంగా 80-100 ఎన్‌జీ-ఎల్ స్థాయిలో మద్యలో ఉంటే, శరీరంలో ఆటో ఇమ్యూనిటి పెరుగుతుందని అద్యయనంలో తేలింది. గాంధీ ఆసుపత్రిలో విటమిన్ ప్లాన్ ఫలించినట్టు వైద్యనిపుణులు పేర్కోన్నారు.