Vemula Prashanth Reddy: రేవంత్ ప్రభుత్వం ఆసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బుల్డోజ్ సమావేశాలుగా మార్చింది అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ప్రశ్నోత్తరాల సమయం ఒక్క రోజే పెట్టారు.. జీరో అవర్ మొత్తానికే ఎత్తేశారు.. సభలో ప్రతి పక్షాల గొంతు నొక్కారు అని పేర్కొన్నారు. డిమాండ్లపై రెండు రోజులే చర్చ జరిపారు.. ఆర్ అండ్ బీ పద్దులపై మాట్లాడే అవకాశం రాలేదు.. ద్రవ్య వినిమయ బిల్లు పూర్తి స్థాయి చర్చ లేకుండా ఆమోదించుకున్నారు.. అసలు విప్పులు ప్రతిపక్ష సభ్యులతో మాట్లాడిందే లేదు అని ఆయన అన్నారు. రేవంత్ ది ప్రజా పాలన కాదు ప్రతి పక్షాలపై పంజా విసిరే పాలన అని
ఈ బడ్జెట్ సమావేశాలు నీరూపించాయని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ సభ్యులు అసెంబ్లీని అథమ స్థాయికి తీసుకెళ్లారు.. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే పెన్షన్లు 15రోజులు లేట్ అయితే తప్పేమిటన్నారు.. విద్యుత్ అరగంట పొతే తప్పేమిటంటున్నారు అని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Wayanad landslides: రెస్క్యూ ఆపరేషన్స్‌లో పాల్గొన్న మోహన్‌లాల్..
ఇక, మరో కాంగ్రెస్ సభ్యుడు వీఆర్ఓ, వీఆర్ఏలు లంచాలు తీసుకుంటే తప్పేమిటని అంటున్నారని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ద్రవ్య వినిమయ బిల్లుపై వాస్తవాలు చెబుతుంటే.. సీఎం జోక్యం చేసుకుని అనవసరంగా మహిళా ఎమ్మెల్యేలను దూషించి కంటతడి పెట్టించారు అని మండిపడ్డారు. నాలుగున్నర గంటలుగా మహిళ ఎమ్మెల్యేలు బతిమిలాడినా మైక్ దొరక లేదు.. సీఎం రేవంత్ తన ఆడంబరాలు, అబద్ధాలకు అసెంబ్లీని వాడుకున్నారు అని ఆయన ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ పై ఊదర గొట్టి అసెంబ్లీలో ఏం చేశారు అని ప్రశ్నించారు. పంజాబ్ రాష్ట్రంలో రైతులకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సాయం చేస్తుంటే ఈ కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది.. కానీ, ఈ రోజు వయనాడ్ కు ఎందుకు ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు పంపుతున్నావ్ రేవంత్ రెడ్డి అంటూ ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.