Wayanad landslides: కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య శనివారం నాటికి 358కి చేరుకుంది. శిథిలాల కింద, కూలిన ఇళ్ల కింద చిక్కుకున్న వ్యక్తుల కోసం రెస్క్యూ బృందాలు డీప్ సెర్చ్ రాడార్ ను ఉపయోగిస్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్‌లో సహాయం చేయడానికి డీప్ సెర్చ్ రాడార్‌ను పంపాలని కేరళ ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. నార్తర్న్ కమాండ్ నుండి ఒక జావర్ రాడార్, ఢిల్లీలోని త్రిరంగ మౌంటైన్ రెస్క్యూ ఆర్గనైజేషన్ నుండి నాలుగు రీకో రాడార్ లను శనివారం వైమానిక దళం విమానంలో వాయనాడ్ కు తీసుకువెళ్లింది.
LB Nagar Crime: బట్టలు ఆరేసే విషయంలో మహిళల మధ్య గొడవ.. కత్తితో దాడి..
సెర్చ్ అండ్ రెస్క్యూలో ప్రత్యేకత కలిగిన ప్రైవేట్ కంపెనీలు, కొందరు వాలంటీర్లు కూడా రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. ఇండియన్ ఆర్మీ, కేరళ పోలీస్, ఎమర్జెన్సీ సర్వీసెస్ విభాగాలు రెస్క్యూ టీమ్‌కు నాయకత్వం వహిస్తున్నాయి. 1,300 మందికి పైగా రెస్క్యూ వర్కర్లు ధ్వంసమైన భవనాలు, శిధిలాల క్రింద భారీ యంత్రాలు, అత్యాధునిక పరికరాలతో ప్రాణాలతో బయటపడిన వారి కోసం వెతకడానికి తీవ్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.
America: యూఎస్ లో సత్యనారాయణస్వామి వ్రతం..ఇంగ్లీష్ లో కథ చెప్పిన పూజారి..వీడియో వైరల్
మలయాళ చిత్ర పరిశ్రమ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఈరోజు వాయనాడ్ చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. మోహన్‌లాల్ టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్. సైనిక శిబిరానికి చేరుకున్న ఆయన సహాయక చర్యలకు నాయకత్వం వహిస్తున్న అధికారులతో మాట్లాడారు. విపత్తు తీవ్రతను ప్రత్యక్షంగా చూస్తేనే అర్థమవుతుందని అన్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, NDRF, అగ్నిమాపక, పోలీసు విభాగాలు రెస్క్యూ ఆపరేషన్‌లో భాగమైన స్థానిక ప్రజలు అద్భుతమైన పని చేసారు. ఇక మరోవైపు డీఎన్‌ఏ, డెంటల్ శాంపిల్స్ తీసుకున్న తర్వాతే మృతదేహాలను దహనం చేయాలని కేరళ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రతి మృతదేహం లేదా అవశేషాలకు గుర్తింపు సంఖ్యను కేటాయించాలి. గుర్తింపు సాధ్యం కాకపోతే, 72 గంటల విచారణ తర్వాత తదుపరి చర్య కోసం మృతదేహాన్ని జిల్లా యంత్రాంగానికి అప్పగించాల్సి ఉంటుంది. కాగా, కల్పత్తా పబ్లిక్ శ్మశానవాటికలో మూడు గుర్తుతెలియని మృతదేహాలను దహనం చేశారు. వాయనాడ్ కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో మృతదేహాలను కాల్చడం లేదా ఖననం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దహన సంస్కారాలు జరిగాయి.
లెఫ్టినెంట్ హోదాలో 'వాయనాడ్' సహాయక చర్యల్లో పాల్గొన్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్..#MohanLal #WayanadLandslide #WayanadTragedy #Kerala #keralaflood #WayanadDisaster #NTVTelugu pic.twitter.com/C6IdicuP1A
— NTV Telugu (@NtvTeluguLive) August 3, 2024
#WATCH | Actor Mohanlal who is a Lieutenant Colonel in the Territorial Army, reached the landslide-hit Mundakkai area in Wayanad.#Kerala pic.twitter.com/feEpYNZa5B
— ANI (@ANI) August 3, 2024