TTD AEO Suspended: తిరుమల తిరుపతి దేవస్థానం ఏఈవో రాజశేఖర్ బాబుపై సస్పెన్షన్ వేటు పడింది. టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా రాజశేఖర్ బాబు వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు.
థాయ్‌లాండ్ యువ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా(37) సస్పెన్షన్‌కు గురయ్యారు. కాంబోడియా మాజీ నేతతో దౌత్యపరమైన సంభాషణం చేయడంపై ఇరాకటంలో పడ్డారు. థాయ్‌లాండ్‌కు సంబంధించిన పాలనా అంశాలు.. పరాయి దేశ నేతతో పంచుకోవడంపై సంకీర్ణ ప్రభుత్వంలోని నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు.
మహారాష్ట్ర అసెంబ్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును ప్రశంసించినందుకు సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అజ్మీని మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఓ వైపు ఔరంగజేబును ప్రశంసిస్తూ.. ఇంకోవైపు శంభాజీ మహారాజ్‌ను విమర్శిస్తూ అజ్మీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. అసెంబ్లీ సభ్యుడి హోదాకు ఈ వ్యాఖ్యలు తగినవి కావని.. ప్రజాస్వామ్య సంస్థను అవమానించడమేనని రాష్ట్ర మంత్రి చంద్రకాంత్ పాటిల్ అన్నారు.
శ్రీచైతన్య విద్యాసంస్థల సెంట్రల్ కిచెన్ వద్ద ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లతో శ్రీ చైతన్య సిబ్బంది వాగ్వాదానికి దిగింది. గ్రేటర్ హైదరాబాద్‌కి సంబంధించిన శ్రీ చైతన్య సెంట్రల్ కిచెన్ లైసెన్స్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు గత శుక్రవారం సస్పెండ్ చేశారు.
విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన గురువులే గాడి తప్పుతున్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దాల్సిన మార్గదర్శకులు కామపిశాచుల్లా తయారవుతున్నారు. క్లాస్ రూముల్లోనే శృంగార కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నారు. ఈ దారుణం రాజస్థాన్‌లోని ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది.
Ranga Reddy విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కీచక ఉపాధ్యాయుడి పై సస్పెన్షన్ వేటు పడింది. రంగారెడ్డి జిల్లా బుద్వేల్ ప్రభుత్వ పాఠశాల ఫిజిక్స్ టీచర్ వేణు గోపాల్ ను జిల్లా విద్యాశాఖ అధికారి సస్పెండ్ చేశారు.
Suspended : వనపర్తి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభు వినయ్ ను సస్పెండ్ చేస్తూ ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే..ప్రభు వినయ్ కుమార్ గత 4 నెలల నుంచి విధులకు హాజరు కాకుండా హాజరు రిజిస్టర్ , ఫైళ్లను ఇంటివద్దకే తెప్పించుకుని సంతకాలు చేస్తూ జీతం తీసుకుంటున్నాడని, సర్వీస్ రిజిస్టరులో పుట్టినతేదీ మార్చుకుని, చట్టవిరుద్ధంగా సర్వీస్ పొడిగించుకోవటంతో పాటు ..సీనియారిటీ లిస్టులో అక్రమాలకు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభు వినయ్…
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ జిల్లాలో ఆలయ నిబంధనలు విస్మరించిన ఒక అధికారిపై సస్పెండ్ అయ్యాడు. అయితే, వింధ్యవాసిని ఆలయంలోనికి పాదరక్షలు ధరించి వచ్చిన అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (అగ్రికల్చర్)ను జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు సస్పెన్షన్ వేటు పడింది.
మధ్యప్రదేశ్‌లో ఓ మహిళా కానిస్టేబుల్ అత్యుత్సాహం ఉద్యోగానికి ఎసరు పెట్టింది. ఓ కోచింగ్ సెంటర్‌ను ప్రమోట్ చేస్తూ ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించిన ప్రకటన పబ్లిక్‌లోకి రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఆమె చర్యను తప్పుపడుతూ సస్పెండ్ చేవారు.
కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లోని లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ ను రైల్వే అధికారులు సస్పెండ్ చేశారు. వేగ పరిమితిని ఉల్లంఘించి వేలాది మంది ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసారు. ఆగ్రా రైల్వే డివిజన్‌లోని మధుర రైల్వే డివిజన్‌కు చెందిన లోకో పైలట్ గంటకు 20 కి.మీ వేగంతో రైలును నడపాలన్న ఆర్డర్‌ను మరచిపోయాడు.