చంద్రబాబు సంస్కారానికి నా నమస్కారం : జగన్‌

విపత్తును కూడా రాజకీయ చేస్తున్నారని సీఎం జగన్‌ అన్నారు. ఇప్పటికై వరదల సాయంపై ఆయా అధికారులతో మాట్లాడి బాధితులకు సాయం అందేలా చూస్తున్నామన్నారు. అయినా కూడా ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతాం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ‘మడమ తిప్పను మాట తప్పను అన్నారు. ఇప్పుడు మడమ తిప్పుతూ మాట తప్పుతున్నారు. గిరా గిరా తిరుగుతూ ఎక్కడో పడిపోతావ్‌’ అని చంద్రబాబు అంటున్నారని జగన్‌ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన జగన్‌ నేనే గాల్లోనే వచ్చి గాల్లోనే పోతానని ఎక్కడో ఒకచోట శాశ్వతంగా పతనం అవుతానని చంద్రబాబు అన్నారని.. తనను ఎదిరించిన వైఎస్సార్‌ కూడా కనుమరుగై పోయారని మాట్లాడారని… నిజంగా ఆయన సంస్కారానికి నా నమస్కారాలు అన్నారు. ఆయన వెళ్లింది దేనికి మాట్లాడుతున్నది దేనికి అంటూ చంద్రబాబుపై జగన్ ఫైర్‌ అయ్యారు.

హుద్‌హుద్‌ తుఫాన్‌ వచ్చినప్పుడు నేనే వెళ్లి ఆపాను. తిత్లీ వచ్చింది. నేనే వెళ్లి దారి మళ్లించాను అని అప్పట్లో చంద్రబాబు ప్రచారం చేసుకున్నారన్నారు. హడావుడి చేసి డ్రామాలు చేశారు. ఆయన ప్రకటించిన అరకొర సాయం కూడా ఇవ్వలేకపోయారన్నారు. ఒడిశా సీఎం కూడా వరదలు వచ్చినప్పుడు కనిపించరు అంటూ జగన్‌ విమర్శలు చేశారు. ఇప్పటికైనా అనసవసర విమర్శలు మాని విపత్తు సమయంలో ప్రజల కోసం పని చేయాలని సూచించారు.

Related Articles

Latest Articles