V Hanumantha Rao Counter Attack On Etela Rajender Reddy: మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ రూ.25 కోట్లు ఇచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు స్పందించారు. ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రూ.25 కోట్లు తీసుకున్నట్టు ఈటెల రాజేందర్, బండి సంజయ్ విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తీసుకున్నాడని తాము చెప్పట్లేదని బీజేపీ నేతలు అంటున్నారని.. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆ డబ్బులు తీసుకుందని వాళ్లు పేర్కొంటున్నారని.. మరి కాంగ్రెస్‌లో ఎవరు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం ప్రజల దృష్టి మళ్లించడం కోసమే ఇలాంటి చెత్త ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మీద అబద్ధపు ప్రచారాలు చేయడం తగునా? అపోహలతో విషప్రచారం చేయడం పద్ధతేనా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి జరిగిన అన్యాయంపై అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని.. అందులో బీఆర్ఎస్ కూడా ఒకటని స్పష్టతనిచ్చారు.
World War II Ship: రెండో ప్రపంచయుద్ధంలో 864 మంది సైనికులతో మునిగిపోయింది.. 84 ఏళ్ల తర్వాత..
తమ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోటీ చేస్తుంది కదా.. అది తెలిసి కూడా ఇలాంటి ఆరోపణలు చేయడం తగునా? అని వీహెచ్ నిలదీశారు. ప్రతి ఎన్నికల్లోనూ సంబంధాలు పెట్టుకునేది మీరని, ఇతరుల మీద రుద్దడం మీకే సాధ్యమని విమర్శించారు. బీఆర్ఎస్‌తో ఎక్కువ సంబంధాలు మీకే ఉన్నాయని విరుచుకుపడ్డారు. ప్రజల్లో కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టాలని ఉండొచ్చు కానీ ఆ పప్పులు ఉడకవని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోవాలని సూచించారు. భాగ్యలక్ష్మి దేవాలయాన్ని కాపాడింది కాంగ్రెస్ పార్టీనేనని తెలిపారు. దేవుడు కేవలం బీజేపీకే సొంతం కాదని, తమకు కూడా దేవుడేనని పేర్కొన్నారు. తమది సెక్యులర్ విధామని అన్నారు. చీప్ మాటలు మాట్లాడకండని సూచించిన ఆయన.. ఇతర పార్టీలను తరిమేయాలన్నది మీ వ్యూహమని, కానీ అధి సాధ్యం కాదని అన్నారు. ఈ దేశంలో నిరుద్యోగ సమస్య ఎప్పటి నుంచో ఉందని.. మరి ఉద్యోగాలు ఇవ్వమని ప్రధాని మోడీని ఎందుకు అడగరని.. అది అడగడం చేత కాదా? అని ఎద్దేవా చేశారు. బీజేపీ వాళ్లు ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. కాంగ్రెస్ జెండా రెపరేపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
Anil Kumar Eravathri: ఈటలకు స్ట్రాంగ్ వార్నింగ్.. రేవంత్ జోలికొస్తే నాలుక కోస్తారు జాగ్రత్త